‘స్వతంత్ర’ న్యూస్‌ చానల్‌ స్టూడియోలు ప్రారంభం

20 May, 2022 05:14 IST|Sakshi
న్యూస్‌ చానల్‌ స్టూడియోలను ప్రారంభిస్తున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి

వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం జగన్‌

సాక్షి, అమరావతి : ‘స్వతంత్ర’ తెలుగు శాటిలైట్‌ న్యూస్‌ చానల్‌ స్టూడియోలను గురువారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ చానల్‌ యాజమాన్యానికి, సిబ్బందికి ఆల్‌ ద బెస్ట్‌ చెప్పారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, సమాచార శాఖ కమిషనర్‌ టి.విజయ్‌కుమార్‌ రెడ్డి, ఆ చానల్‌ ఎండీ బి.కృష్ణప్రసాద్, ఎడిటర్‌ తోట భావ నారాయణ, అసిస్టెంట్‌ ఎడిటర్‌ రమా విశ్వనాథన్, చీఫ్‌ న్యూస్‌ కో ఆర్డినేటర్‌ ఆకుల అమరయ్య, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు