చిత్తూరు: సీఎం జగన్‌ ఇళ్ల పట్టాల పైలాన్‌ ఆవిష్కరణ

28 Dec, 2020 14:29 IST|Sakshi

సాక్షి, చిత్తూరు: శ్రీకాళహస్తి మండలం ఊరందూరులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 'నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు' పథకాన్ని సోమవారం ప్రారంభించారు. పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేసి..  వైఎస్సార్‌ జగనన్న కాలనీలో తొలి విడతలో నిర్మించనున్న ఇళ్ల నిర్మాణ పనులను పనులను సీఎం ప్రారంభించారు. అంతకుముందు 'నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు' పైలాన్‌ను ఆయన‌ ఆవిష్కరించారు. అనంతరం అక్కడ బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా పండుగ జరుగుతోందని అన్నారు. సొంతిళ్లు లేని నిరుపేదల్లో చిరునవ్వు కనిపిస్తోందని సీఎం ఆనందం వ్యక్తం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 30.75లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తున్నామని అన్నారు. తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలను చేపడుతున్నామని తెలిపారు. కాగా, ఊరందూరులో వైఎస్సార్‌ జగనన్న కాలనీలో 167 ఎకరాల్లో అన్ని సౌకర్యాలతో కూడి 6,232 ప్లాట్లు వేశారు. వీటిలో 4,299 ప్లాట్లను పట్టణ పేదలకు, 465 శ్రీకాళహస్తి రూరల్, 1,468 ప్లాట్లు ఏర్పేడు రూరల్‌ ప్రాంతాలకు చెందిన పేదలకు కేటాయించారు. తొలివిడతలో భాగంగా 5,548 ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి సోమవారం శ్రీకారం చుట్టారు. కాలనీని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు 8,600 మొక్కలు నాటారు.

మరిన్ని వార్తలు