హామీల అమలులో సీఎం జగన్‌ నూతన ఒరవడి..

30 Dec, 2022 03:47 IST|Sakshi

నిరాటంకంగా నవరత్నాలు

ముందుగానే క్యాలెండర్‌ ప్రకటించి అమలు

ఆర్థిక ఇబ్బందులున్నా లోటు లేకుండా సంక్షేమం

13 కొత్త జిల్లాలతో పాలనా వికేంద్రీకరణ

సాక్షి, అమరావతి: కోవిడ్‌ సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థ ఇంకా కోలుకోనప్పటికీ 2022లో నవరత్నాలు–సంక్షేమ పథకాల అమలును రాష్ట్ర ప్రభుత్వం నిరాటంకంగా కొనసాగించింది. మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా  కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేసి ఈ ఏడాది ఏప్రిల్‌ 4 నుంచి ముఖ్యమంత్రి జగన్‌ అమలులోకి తెచ్చారు.

ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొత్త జిల్లాలు ఏర్పాటు కావడంతోపాటు పాలన సజావుగా కొనసాగుతోంది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ముఖ్యమంత్రి జగన్‌ కొత్త ఒరవడి నెలకొల్పారు. పథకాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా సంక్షేమ క్యాలెండర్‌ను ముందుగానే ప్రకటించి తు.చ. తప్పకుండా అమలు చేసి చూపించారు. బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు పారదర్శకంగా నగదు జమ చేశారు. 

2022 జనవరి – డిసెంబర్‌ 27 వరకు నగదు బదిలీ, కీలక ఘట్టాలు
► జనవరి 1: వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక రూ.2,500కి పెంపు. 61.75 లక్షల మందికి ప్రయోజనం చేకూర్చిన సీఎం జగన్‌. పెన్షన్‌ పెంపుతో 2022లో లబ్ధిదారులకు అదనంగా రూ.1,852.50 కోట్ల మేర ప్రయోజనం.
► జనవరి 3: వైఎస్సార్‌ రైతు భరోసా ద్వారా 50.59 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.1,120 కోట్లు. తుపాను వల్ల పంట నష్టపోయిన 8.34 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.646 కోట్లు జమ. 
► జనవరి 25: వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం ద్వారా 3,96,674 మంది అగ్రవర్ణ పేద మహిళలకు రూ.589 కోట్లు అందించిన సీఎం జగన్‌
► ఫిబ్రవరి 8: జగనన్న చేదోడు ద్వారా 2,85,350 మంది లబ్ధిదారులకు 
రూ.285.55 కోట్లు
► ఫిబ్రవరి 15: భారీ వర్షాలకు పంట నష్టపోయిన 5,97,311 మంది రైతులకు రూ.542.06 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ జమ. 1,220 రైతు గ్రూపులకు యంత్రసామగ్రికి రూ.29.51 కోట్లు జమ
► ఫిబ్రవరి 28: జగనన్న తోడు ద్వారా 5,10,462 మంది చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాల కింద రూ.510.46 కోట్లు. సకాలంలో రుణాలు చెల్లించిన 
చిరు వ్యాపారులకు వడ్డీ కింద రూ.16.16 కోట్లు జమ
► మార్చి 14: జగనన్న విద్యా దీవెన కింద 10.82 లక్షల మంది విద్యార్థులకు రూ.709 కోట్లు జమ
► ఏప్రిల్‌ 4 : నూతనంగా ఏర్పాటు చేసిన 13 జిల్లాలను క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించిన సీఎం
► ఏప్రిల్‌ 8: నంద్యాలలో జగనన్న వసతి దీవెన కింద 10,68,150 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.1,024 కోట్లు జమ
► ఏప్రిల్‌ 22: ప్రకాశం జిల్లాలో వైఎస్సార్‌ సున్నా వడ్డీ కింద 1,02,16,410 మంది మహిళలకు రూ.1,261 కోట్లు జమ
► ఏప్రిల్‌ 28: గ్రేటర్‌ విశాఖ పరిధిలో 1,24,581 మందికి ఇళ్ల స్థలాలు, 3,03581 మందికి గృహ మంజూరు పత్రాలు పంపిణీ
► మే 5: తిరుపతిలో జగనన్న విద్యా దీవెన కింద 10,85,225 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.709.20 కోట్లు జమ
► మే 16: వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ పెట్టుబడి సాయం కింద 50.10 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3,758 కోట్లు జమ
► జూన్‌ 14: వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా కింద మూడో ఏడాది 15.16 లక్షల మంది రైతులకు రూ.2,977.82 కోట్లు
► జూన్‌ 27 : శ్రీకాకుళం జిల్లాలో మూడో ఏడా­ది జగనన్న అమ్మ ఒడి కింద 43,96,402 మం­ది తల్లుల ఖాతాల్లో రూ.6,595 కోట్లు జమ
► జూలై 5: జగనన్న విద్యా కానుక కింద 47,40,421 మంది విద్యార్థులకు రూ.931.02 కోట్ల వ్యయంతో కిట్లు పంపిణీ
► జూలై 15: వైఎస్సార్‌ వాహన మిత్ర ద్వారా మూడో ఏడాది 2,61,516 మందికి రూ.10 వేల చొప్పున రూ.261.52 కోట్లు సాయం
► జూలై 19: వివిధ పథకాల కింద మిగిలిపోయిన 3,39,096 మంది అర్హులకు రూ.137 కోట్లు
► జూలై 29: వైఎస్సార్‌ కాపు నేస్తం కింద 3,38,792 మంది కాపు మహిళలకు రూ.508.18 కోట్లు జమ
► ఆగస్టు 3: జగనన్న తోడు కింద 3.95 లక్షల మంది చిరువ్యాపారులకు వడ్డీ లేని రుణాల కింద రూ.395 కోట్లు. సకాలంలో రుణాలు చెల్లించిన చిరువ్యాపారులకు వడ్డీ రాయితీ కింద రూ.15.96 కోట్లు జమ
► ఆగస్టు 11: జగనన్న విద్యా దీవెన కింద 11.02 లక్షల మందికి రూ.694 కోట్లు జమ 
► ఆగస్టు 25: వైఎస్సార్‌ నేతన్న నేస్తం కింద 80,546 మందికి రూ.193.31 కోట్లు సాయం
► సెప్టెంబర్‌ 23: చిత్తూరు జిల్లా కుప్పంలో వైఎస్సార్‌ చేయూత కింద 26,39,703 మంది మహిళలకు రూ,4,949 కోట్లు జమ
► అక్టోబర్‌ 17: వైఎస్సార్‌ రైతు భరోసా కింద 50.92 లక్షల మంది రైతులకు రూ.2,096.14 కోట్లు సాయం
► నవంబర్‌ 28: ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద 45,998 మంది రైతులకు రూ.39.39 కోట్లు జమ. వైఎస్సార్‌ సున్నా వడ్డీ కింద 8,22,411 మంది రైతులకు రూ.160.55 కోట్లు జమ
► నవంబర్‌ 30: జగనన్న విద్యా దీవెన కింద 11.02 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు రూ.694 కోట్లు జమ
► డిసెంబర్‌ 27: మొత్తం 11 పథకాలకు సంబంధించి మిగిలిపోయిన 2,79,065 మంది అర్హుల ఖాతాలకు రూ.590.91 కోట్లు జమ 

మరిన్ని వార్తలు