అకాల వర్షాలపై సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

19 Mar, 2023 15:19 IST|Sakshi

తాడేపల్లి: అకాల వర్షాలపై అధికారులకు సీఎం జగన్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. వానల వల్ల జరిగిన పంట నష్టంపై ఎన్యుమరేషన్‌ ప్రారంభించాలని సూచించారు. వారం రోజుల్లో దీనికి సంబంధించి నివేదికలు ఇవ్వాలని చెప్పారు. నివేదికల ఆధారంగా రైతులకు సహాయపడేందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులకు స్పష్టం చేశారు.

కాగా, ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో పిడుగులు, వడగళ్లు హడలెత్తిస్తున్నాయి. దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి జార్ఖండ్‌ వరకు.. రాయలసీమ, తెలంగాణ, ఒడిశాల మీదుగా ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ వరకు కొనసాగుతున్న ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఆదివా­రం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు­గోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని పేర్కొన్నారు.

అలాగే, శ్రీకాకుళం, విజయ­నగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతా­రామ­రాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకి­నాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదా­వరి, ఏలూరు, కృష్ణా, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో సోమవారం అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుపడే అవకాశముందని తెలిపా­రు.
చదవండి: భారీ వర్షాలు.. పిడుగులు

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు