అబ్దుల్‌ కలాంకు సీఎం జగన్‌ నివాళి

15 Oct, 2021 16:31 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: మాజీ రాష్ట్రపతి, మిస్సైల్‌ మ్యాన్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం జయంతి​ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. 'సమగ్రతకు, విజ్ఞానానికి అబ్దుల్‌ కలాం ప్రతిరూపం. శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశానికి ఎనలేని సేవలు అందించిన డాక్టర్ అబ్దుల్ కలాం జీవితం కోట్ల మందికి ఆదర్శనీయం. లక్ష్య సాధనకు కృషి చేసే యువతకు ఆదర్శవంతంగా, స్పూర్తి దాతగా ఉంటారు' అంటూ సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు