టీటీడీ చరిత్రలో అరుదైన దృశ్యం..

11 Oct, 2021 07:41 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

నాడు పట్టువస్త్రాలు సమర్పించిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి

నేడు సారె సమర్పించనున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

టీటీడీ చరిత్రలో అరుదైన దృశ్యం మరో పర్యాయం ఆవిష్కృతం కానుంది. ఒకే కుటుంబంలో  ఇద్దరికి ముఖ్యమంత్రి హోదాలో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించే మహద్భాగ్యం దక్కింది.  గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఐదుసార్లు పట్టువస్త్రాలు అందించారు. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సోమవారం మూడోసారి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.  

సాక్షి, తిరుమల: రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి 1953లో టీటీడీకి వచ్చినప్పటి నుంచి శ్రీవారికి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టువస్త్రాలను సమర్పించే సంప్రదాయం మొదలైంది. తొలినాళ్లలో పట్టు వస్త్రాలను ఎండోమెంట్‌ అధికారులు, తర్వాత దేవదాయశాఖ మంత్రులు సమర్పించేవారు. ఎన్టీఆర్‌ హయాం నుంచి ముఖ్యమంత్రి స్వయంగా శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించే సంప్రదాయం మొదలైంది.

ఈ క్రమంలో ఐదు పర్యాయాలు ముఖ్యమంత్రి హోదాలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడో పర్యాయం శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. తండ్రీతనయులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించే రెండు సమయాల్లోనూ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి టీటీడీలో విధులు నిర్వర్తిస్తుండడం మరో విశేషం.    

మరిన్ని వార్తలు