రామాయపట్నం పోర్ట్‌.. యువతకు ఉపాధి.. అన్నివిధాలుగా మేలు: సీఎం జగన్‌

20 Jul, 2022 09:28 IST|Sakshi

నెల్లూరు రామాయపట్నం పోర్ట్‌ భూమి పూజ కార్యక్రమం అప్‌డేట్స్‌

13:10PM
► రామాయపట్నం పర్యటన ముగించుకొని తాడేపల్లి బయలు దేరిన సీఎం వైఎస్ జగన్.

12:40PM

స్థానిక ఎమ్మెల్యే మహిధర్‌ రెడ్డి చేసిన విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందించిన సీఎం జగన్‌. హామీలను నెరవేరుస్తానని వెల్లడి.

12:38PM

► పోర్టు రావడానికి సహకరించిన గ్రామాలకు, లోన్లు ఇచ్చిన బ్యాంకులకు కృతజ్ఞతలు: సీఎం జగన్‌.

12:33PM

► రామాయపట్నం పోర్టు రావడం వల్ల ఎకనమిక్‌ యాక్టివిటీ పెరుగుతుంది: సీఎం జగన్‌

► రామాయపట్నం పోర్టుతో రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది: సీఎం జగన్‌ 

 ఎంతో మంది యువతకు ఉద్యోగాలు వస్తాయి. రవాణా ఖర్చుకూడా గణనీయంగా తగ్గుతుంది. 

► ప్రత్యక్షంగా వేల మందికి.. పరోక్షంగా లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు.

12:10PM
పోర్టు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన నిర్వాసితులు. పోర్టు కలను నెరవేర్చిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు.

12:00PM
చంద్రబాబు వేసింది పోర్టు పునాదా?: మంత్రి గుడివాడ
దేశంలోనే రెండో అతిపెద్ద తీరం కలిగిన రాష్ట్రం మనది.. రామాయపట్నం పోర్టు భూమి పూజ.. చరిత్రలో నిలిచిపోయే రోజు అని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు గతంలో చంద్రబాబు హయాంలో శంకుస్థాపన అంటూ డ్రామాలాడారు. అదసలు పునాదా? అని ప్రశ్నించారు. అనుమతులు లేకున్నా చేసిన పనిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని టీడీపీ అధినేతకు చురకలు అంటించారు మంత్రి గుడివాడ. సీఎం జగన్‌ సారథ్యంలో.. ప్రజల సంక్షేమంతో పాటు పారిశ్రామిక అభివృద్ధి కూడా జరుగుతోందని పేర్కొన్నారు.

11:47AM
గ్రామస్తులకు హృదయపూర్వక వందనాలు

► కందుకూరు నిజయోకవర్గ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు ఇది అని స్థానిక ఎమ్మెల్యే మహిధర్‌ రెడ్డి అభివర్ణించారు. దశాబ్ద కాలంగా మాటలతో, శిలాఫలకాలతో కాలం గడిపిన నేతలను చూశాం. ఇప్పుడు.. ఆ కలను నిజం చేసే నాయకుడిని చూస్తున్నాం అంటూ సీఎం జగన్‌ను ఉద్దేశించి ఆయన అన్నారు. పోర్టు మాత్రమే కాకుండా.. పోర్టు ఆధారిత పరిశ్రమలు కూడా తరలి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మొండివారిపాలెం, ఆవులవారిపాలెం, కర్లపాలెం, చేవూరు, రావూరు, సాల్‌పేట గ్రామస్తులకు హృదయ పూర్వక వందనాలు తెలియజేశారు ఎమ్మెల్యే మహిధర్‌ రెడ్డి. నిర్వాసితులకు అన్ని విధాల న్యాయం చేకూర్చేందుకు సీఎం జగన్‌ సిద్ధంగా ఉన్నారంటూ ఆయన మరోమారు స్పష్టం చేశారు.


11:35AM

రామాయపట్నం పోర్ట్‌ కార్యక్రమం వేదికగా.. ఏపీ మారిటైం విజన్‌ స్టేట్‌మెంట్‌ను ఆవిష్కరించిన సీఎం జగన్‌. భవిష్యత్‌ తరాలకు ఉద్యోగాల వంటిదని అధికారుల వర్ణన. 

11:21AM

రామాయపట్నం ఓడరేవుపై స్పెషల్‌ ఏవీ ప్రదర్శన.. పలు విశేషాలు.

11:18AM

రామాయపట్నం స్కూల్‌ పిల్లలతో కలిసి వందేమాతర గీతాలాపనలో సీఎం జగన్‌, ఇతరులు పాల్గొన్నారు. అనంతరం పిల్లలతో ఫొటో దిగారు.

కేవలం ఏపీకి మాత్రమే కాదు.. పక్కనున్న రాష్ట్రాలకు.. మొత్తం దేశం అభివృద్ధికి ఉపయోగపడనుంది. ఏపీతో పాటు పలు రాష్ట్రాలకు వ్యాపార, వాణిజ్య సేవలు సులభతరం కానున్నాయి.

11:16AM

► జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించిన సీఎం జగన్‌.

► మంత్రులు, స్థానిక నేతలు, అధికారులతో కలిసి పోర్టు ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించిన సీఎం జగన్‌.

36 నెలల్లోనే తొలిదశ పనులు

► రామాయపట్నం పోర్టు తొలిదశ పనులను 36 నెలల్లోనే పూర్తి చేయిచాలని లక్ష్యంగా పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం. 

► ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉలవపాడు హైవేకి కేవలం నాలుగున్న కిలోమీటర్ల దూరంలోనే పోర్టు. 

11:06AM

► ప్రగతి తీరంగా.. రామాయపట్నం పోర్టు పనుల ప్రారంభంతో ప్రకాశం, నెల్లూరు జిల్లాల వాసుల కల నెరవేరనుంది.  

10:53AM

► రామాయపట్నం పోర్టు పనులను ప్రారంభించిన సీఎం జగన్‌

రామాయపట్నం పోర్టు పనులను ప్రారంభించారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌. సముద్రుడికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజాకార్యక్రమంలో పాల్గొన్నారు. సముద్రంలో డ్రెడ్జింగ్‌ పనుల్ని ఆయన ప్రారంభించారు. అనంతరం రామాయపట్నం పోర్టు పైలాన్‌ను ఆవిష్కరించారు.

10:30AM
► నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు హెలిప్యాడ్‌కు చేరుకొన్న సీఎం వైఎస్ జగన్.  స్వాగతం పలికిన మంత్రులు ,ఎమ్మెల్యేలు, అధికారులు.

9:43 AM
రామాయపట్నం పోర్టు భూమి పూజ కార్యక్రమం కోసం తాడేపల్లి నుంచి బయలుదేరిన సీఎం వైఎస్‌ జగన్‌. సీఎం వెంట మంత్రులు గుడివాడ అమర్నాథ్‌, అంబటి రాంబాబు ఉన్నారు.

రామాయపట్నం పోర్టుతో ఏపీలో మౌలిక సదుపాయాల రంగానికి కొత్త ఊపు రానుంది.

సహాయ, పునరావాసానికి రూ. 175.04 కోట్ల వ్యయం భరించనుంది ప్రభుత్వం. 

రెండు దశల్లో రూ.10,640 కోట్లతో రామాయపట్నం పోర్టు నిర్మాణం చేపట్టింది ఏపీ ప్రభుత్వం.

► ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరి రామాయపట్నం చేరుకుంటారు. రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులకు శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గొంటారు. బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించి.. మధ్యాహ్నాం తిరిగి తాడేపల్లి బయలుదేరుతారు. 

►  పోర్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. 

రెండు దశల్లో 19 బెర్త్‌లతో..
రామాయపట్నం ఓడరేవు నిర్మాణానికి అవసరమైన కీలక పర్యావరణ అనుమతులను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే తెచ్చింది. కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌ ఏరియా అనుమతులతో పాటు అటవీ అనుమతులను కూడా సాధించింది.

► రామాయపట్నం ఓడ రేవును మొత్తం రూ.10,640 కోట్ల వ్యయంతో రెండు దశల్లో 19 బెర్త్‌లతో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

► తొలిదశలో రూ.3,736.14 కోట్ల పనులకు పరిపాలన అనుమతులు  మంజూరు చేసింది. తొలిదశలో నాలుగు బెర్త్‌లతో ఓడ రేవు నిర్మాణానికి టెండర్లను పిలిచింది.

► రూ.2,647 కోట్ల విలువైన తొలి దశ పనులను నవయుగ, అరబిందో కన్సార్టియం దక్కించుకున్నాయి.  

ఇప్పటికే తొలి దశ టెండర్లను ఖరారు చేయడంతో భూమి పూజతో పనులు ప్రారంభం కానున్నాయి. 

రామాయపట్నం పోర్టుతో ప్రయోజనాలు

వెనకబడ్డ ప్రాంతంలో అభివృద్ధికి ఊతం కానుంది. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం జాతీయరహదారికి కేవలం 4.5 కిలోమీటర్ల దూరంలో పోర్టు నిర్మాణం జరగనుంది.
పోర్టు తొలిదశ పనులు 36 నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రూ. 3736.14 కోట్లతో పోర్టు తొలిదశ పనులు చేపట్టనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఏపీ మారిటైం బోర్డు కింద ప్రాజెక్టును రామాయపట్నం పోర్టు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ నిర్మించనుంది. 
తొలిదశలో మొత్తం నాలుగు బెర్తుల నిర్మాణం. ఏడాదికి 25 మిలియన్‌ టన్నుల ఎగుమతి. కార్గో, బొగ్గు, కంటైనర్ల కోసం నాలుగు బెర్తుల నిర్మాణం
రెండో దశలో 138.54 మిలియన్‌ టన్నులకు విస్తరణ, మొత్తంగా 15 బెర్తుల నిర్మాణం.
ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కర్నూలు సహా రాయలసీమలోని పలు జిల్లాలు,  తెలంగాణలోని నల్గొండ, మహబూబ్‌నగర్,రంగారెడ్డి, హైదరాబాద్‌ ప్రాంతాలకు సంబంధించి పారిశ్రామిక, వాణిజ, రవాణా సేవల్లో కీలకం కానున్న రామాయపట్నం పోర్టు.
తెలంగాణ, ఛత్తీస్‌గఢ్,మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన పలుప్రాంతాలకు వాణిజ్య, వ్యాపార, రవాణా సేవలు సుభతరం.
రూ.3500 కోట్లతో మొత్తంగా 9 షిఫింగ్‌ హార్బర్ల నిర్మాణం.
ఫేజ్‌–1లో 4 హార్బర్ల నిర్మాణం.జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడల్లో తొలిదశలో ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం.
రెండో దశ కింద మొత్తం 5 చోట్ల ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం. బుడగట్ల పాలెం, పూడిమడక, బియ్యపు తిప్ప, వాడరేవు, కొత్తపట్నంల్లో రెండోదశలో షిఫింగ్‌ హార్బర్ల  విస్తృతంగా ఉపాధి అవకాశాలు. పెరగనున్న ఆర్థికవ్యవస్థ. 
 వేలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 

 చంద్రబాబు ఉత్తుత్తి పునాది రాయి
గత ఎన్నికలకు ముందు 2019 జనవరి 9వ తేదీన భూ సేకరణ చేయకుండా, పర్యావరణ, అటవీ అనుమతులు లేకుండా రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు రామాయపట్నం పోర్టుకు ఉత్తుత్తి పునాది రాయి వేసి చేతులు దులుపుకొన్నారు. కానీ, వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ఓడరేవులను చేపట్టడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది.

► ఓడరేవుల నిర్మాణం ద్వారా రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రామాయపట్నానికి అవసరమైన 255.34 ఎకరాల సేకరణను ప్రభుత్వం చేపట్టింది. మరోపక్క ఓడరేవు నిర్మాణంతో నిర్వాసితులయ్యే పరిసర గ్రామాల ప్రజలకు సహాయ, పునరావాస చర్యలను ప్రారంభించి రూ.175.04 కోట్లు వ్యయం చేస్తోంది. 

రామాయపట్నం ఓడ రేవు కలను సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. ఓడరేవుకు అవసరమైన భూ సేకరణ పూర్తి చేయడంతో పాటు కీలకమైన పర్యావరణ, అటవీ అనుమతులన్నీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే సాధించింది. అన్ని అనుమతులు వచ్చిన నేపథ్యంలో రామాయపట్నం ఓడరేవు నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం భూమి పూజ చేయనున్నారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రసంగిస్తారు. 

మరిన్ని వార్తలు