సామాజిక ఆర్థిక సర్వే విడుదల చేసిన సీఎం జగన్‌

15 Mar, 2023 12:09 IST|Sakshi

సాక్షి, అమరావతి: శాసనసభలోని సీఎం చాంబర్‌లో 2022-23 సామాజిక ఆర్థిక సర్వేను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం విడుదల చేశారు. అనంతరం  ప్రణాళికశాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ ప్రగతిలో ఏపీ నంబర్‌ వన్‌ అన్నారు. రూ.13.17 కోట్లు జీఎస్డీపీ నమోదైందన్నారు. గతంతో పోల్చితే రూ.1.18 లక్షల కోట్లు జీఎస్డీపీ పెరిగిందని ఆయన వివరించారు.

ఆలిండియా యావరేజ్‌ కన్నా ఏపీ తలసరి ఆదాయం ఎక్కువ
‘‘వ్యవసాయం లో 13.18 శాతం, పరిశ్రమలలో 16.36 శాతం, సేవా రంగంలో  18.91 శాతం వృద్ధి నమోదైంది. 36 శాతం కంట్రీబ్యూషన్‌ వ్యవసాయం నుంచి వస్తోంది. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి కనిపిస్తోంది. ఆలిండియా యావరేజ్‌ కన్నా ఏపీ తలసరి ఆదాయం ఎక్కువ. ఏపీ అభివృద్ధి 16.2 శాతం నమోదైంది. విద్య, ఆరోగ్య రంగాల్లో అనుహ్య అభివృద్ధి సాధించాం. శిశు మరణాలు గణనీయంగా తగ్గాయి’’ అని విజయ్‌కుమార్‌ వెల్లడించారు.
చదవండి: అసెంబ్లీలో టీడీపీకి మైండ్‌ బ్లోయింగ్‌ రిప్లై ఇచ్చిన మంత్రి బొత్స

మరిన్ని వార్తలు