‘అర్హులైన ప్రతి పేద విద్యార్థికీ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు’

30 Nov, 2021 15:26 IST|Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: కరోనా సమయంలో కూడా విద్యార్థుల చదువులకు ఇబ్బంది లేకుండా ఇచ్చిన మాట మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను చెల్లిస్తున్నారు. అందులో భాగంగా ఈ ఏడాది మూడో విడతగా 11.03 లక్షల మంది విద్యార్థులకు ‘జగనన్న విద్యా దీవెన’ కింద రూ.686 కోట్లువిడుదల చేశారు.

చదవండి:  Jagananna Vidya Deevena: 11.03 లక్షల మంది విద్యార్థులకు రూ.686 కోట్లు

ఈ సందర్భంగా సీఎం జగన్‌ ‘పెద్ద చదువులు చదవడానికి, పెద్ద స్థాయికి ఎదగడానికి ఎవరికీ పేదరికం అడ్డుకాకూడదు. అరకొరగా కాకుండా అర్హులైన ప్రతి పేద విద్యార్థికీ మంచి చేస్తూ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేస్తున్నాం. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా వారందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తింపజేస్తున్నాం’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

‘మన లక్ష్యం 100 శాతం అక్షరాస్యత మాత్రమే కాదు, 100 శాతం పిల్లల్ని గ్రాడ్యుయేట్లుగా నిలబెట్టడం కూడా. దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 11.03 లక్షల మంది విద్యార్థులకు లబ్ది కలిగేలా ఈఏడాది 3వ త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ రూ.686 కోట్లు విడుదల చేశాం’ అని సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు