కన్నీళ్లను తుడిచేది సీమ ఎత్తిపోతలే

29 Dec, 2022 12:00 IST|Sakshi

అది మినహా మరో ప్రత్యామ్నాయం లేదు  రాయలసీమ కడగండ్లను తీర్చండి

శ్రీశైలం, సాగర్‌పై తెలంగాణ ఏకపక్ష ధోరణి

యథేచ్ఛగా విద్యుదుత్పత్తికి నీటి విడుదలతో ఏపీ ప్రయోజనాలకు తీవ్ర నష్టం

కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్రయాదవ్‌తో సీఎం జగన్‌ భేటీ

సాక్షి, న్యూఢిల్లీ: తరతరాలుగా కరువుతో తల్లడిల్లు­తున్న సీమ కడగండ్లు తీర్చేలా చేపట్టిన రాయల­సీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమ­తులు మంజూరు చేయాలని కేంద్ర అటవీ, పర్యా­వరణ శాఖ మంత్రి భూపేంద్రయాదవ్‌కు సీఎం వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు. కరువుతో అల్లాడే సీమ ప్రాంతానికి తాగు­నీరు అందించేలా రాయలసీమ ఎత్తిపోతల ఎంతో ఉపకరిస్తుందని పథకం ఆవశ్యక­తను వివరించారు.

శ్రీశైలం, నాగార్జున సాగర్‌ జ­లాశయాలకు సంబంధించిన అంశాలను కూడా కేం­ద్ర­మంత్రి దృష్టికి తెచ్చారు. మచిలీపట్నం, భావ­నపాడు పోర్టులు, పంప్డ్‌ స్టోరేజీ విద్యుదుత్పత్తి ప్రా­జెక్టులకు పర్యా­వరణ అనుమతులు వేగంగా మం­జూరు చేసి రాష్ట్ర ప్రగతికి తోడ్పాటు అందించా­లని కోరారు. బుధ­వారం ఢిల్లీలో భూపేంద్రయా­దవ్‌తో 40 నిమిషాల పాటు సమావేశం సందర్భంగా పర్యావ­రణ అనుమతు­లతో­పాటు రాష్ట్రా­భి­వృద్ధి­కి సంబంధించిన పలు అంశాలపై సీఎం చర్చించారు.

ఏకపక్షంగా నీటి విడుదల.. 
కృష్ణా నదిపై ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. కృష్ణా నది యాజ­మాన్య బోర్డు ఆప­రే­ష­నల్‌ ప్రొటో­కాల్స్, ఒప్పందాలు, ఆదే­శా­లను ఉల్లం­­ఘించడంతో కృష్ణాపై వాటా హక్కుల్ని ఏపీ కోల్పోవాల్సి వస్తోందన్నారు. 2021–22, 2022­–­­­23­లో సీజన్‌ ప్రారంభమైన తొలిరోజు నుంచి అంటే జూన్‌ 1వ తేదీ నుంచే విద్యు­దుత్పత్తి కోసం తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలా­లను  వినియోగించడం ప్రారంభించింద­న్నా­రు. శ్రీ­శై­లం జలాశయంలో కనీస నీటి మట్టం 834 అడు­గులు కంటే తక్కువగా ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తికి నీటిని విడుదల చేయ­డంతో పాటు బోర్డుకు ఎలాంటి ఇండెంట్‌ లేకుండా... నాగార్జునసాగర్, కృష్ణాడెల్టాకు అవస­రం లేన­ప్పటికీ ఏకపక్షంగా నీటిని విడుదల చేసిందన్నారు.

నీటి పారుదల అవసరాల్లో విద్యుదుత్పత్తి అన్నది కేవలం యాదృచ్ఛికంగా ఉంటుందని  స్పష్టం చేశారు. విద్యుదుత్పత్తి కోసం తెలంగాణ ప్రభుత్వం ఏటా 796 అడుగుల దిగువ వరకు నీటిని విడుదల చేస్తూ శ్రీశైలంలో కనీస నీటి మట్టం నిర్వహణకు సహకరించడం లేదని సీఎం జగన్‌ తెలిపారు. దీని­వల్ల ఏపీ ఎదుర్కొంటున్న ఇబ్బందిని గతంలోనే కేంద్రం దృష్టికి తెచ్చా­మని గుర్తు చేశారు. శ్రీశైలం జలా­శయంలో నీటిమ­ట్టం 881 అడుగులకు చేరుకుంటే కానీ పోతిరెడ్డి­పాడు నుంచి పూర్తిస్థాయి­లో నీటి విడుదల సాధ్యం కాదని కేంద్రమంత్రికి వివరించారు. లేదంటే పోతి­రెడ్డి­పాడు నుంచి కరువు పీడిత రాయలసీమ సాగు, తాగునీటి అవసరాలతో పాటు శ్రీపొట్టి­శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లా­లకు, చెన్నైకి తాగునీరు అందించడం సాధ్యం కాదన్నారు.

ఎత్తిపోతల మినహా మరో ప్రత్యామ్నాయం లేదు..
తెలంగాణ ప్రభుత్వం అనధికారికంగా, ఎలాం­టి పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మిస్తున్న పాలమూరు– రంగారెడ్డి ఎత్తి­పోతల పథకం (3 టీఎంసీలు), దిండి పథ­కాల గురించి గతంలోనే కేంద్రం దృష్టికి తెచ్చామని సీఎం జగన్‌ గుర్తు చేశారు. దీనివల్ల శ్రీశైలం నీటి మట్టం 854 అడుగుల కంటే పైన నిర్వహించడం సాధ్యం కాదని, మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు కేటా­యిం­చిన నీటిని వినియోగించుకోవడం కూడా సాధ్య­ప­డదన్నారు.

ఈ పరిస్థి­తుల నేప«థ్యంలో రా­య­­ల­సీమ ఎత్తిపోతల పథకం (ఆర్‌ఎల్‌ఎస్‌) అ­మలు చేయడం మినహా ఆంధ్ర­ప్రదేశ్‌ ప్రభుత్వా­నికి మరో ప్రత్యామ్నాయం లేదని, దీనిద్వారా రోజుకు 3 టీఎంసీల నీటిని తెలుగు గంగ ప్రాజెక్టు, ఎస్‌­ఆర్‌బీసీ, గాలేరునగరి సుజల స్రవంతికి సర­ఫరా చేయగలుగుతామ­న్నారు. నిబంధనలు, ప్రొటో­కాల్స్‌ను పూర్తిగా విస్మరించి తెలంగా­ణ ప్రభు­త్వం నీటిని విడుదల చేయటాన్ని దృష్టిలో పెట్టు­కుని రాయలసీమ ఎత్తిపోతలను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయడం ద్వారా  ఏపీ ప్రయో­జ­నాలు ప్రమాదంలో పడకుండా కాపాడా­ల­న్నారు. 

ప్రధాన కాలువకు నీటిని అందించేందుకే..
రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమ­తు­ల కోసం కేంద్ర అటవీ పర్యావరణశాఖకు దర­ఖా­స్తు చేశామని, దీనికి సంబంధించి రాష్ట్ర అధికా­రు­లతో సమగ్ర చర్చలు జరిగాయని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తెలి­పారు. దీనికి సంబంధించి సమాచా­రాన్ని ఇప్పటికే అందించామన్నారు. ఇందుకోసం భూ సేక­రణ చేయడం లేదని, అటవీ ప్రాంతం, వన్య­ప్రా­ణుల అభయార­ణ్యాల ప్రమే­యం లేదని, ఎకో సెన్సిటివ్‌ జోన్‌ నుంచి 10 కి.మీ దూరంలో ఉండడంతో పాటు కేవలం ప్రధాన కాలువకు పూర్తి­స్థాయిలో నీటిని అందించడం కోసమే ఎత్తిపోతలను చేపడుతున్నట్లు సీఎం వివరించారు. వీలైనంత త్వర­లో రాయల­సీమ ఎత్తి­పో­తల పథకా­నికి పర్యావరణ అనుమ­తులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

పంప్డ్‌ స్టోరేజ్‌ విద్యుదుత్పత్తి..
పునరుత్పాదక ఇంధనం, గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్ప­త్తిని ప్రోత్సహించేందుకు ప్రధాని మోదీ లక్ష్యానికి అనుగు­ణంగా రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమా­లను చేపట్టిందని సీఎంజగన్‌ వివ­రిం­చారు. పంప్డ్‌ స్టోరేజ్‌ విద్యుదు­త్ప­త్తికి అను­వైన స్థలాలను గుర్తించడంలో ఆంధ్ర­ప్రదేశ్‌ ముందంజలో ఉందని, వీటిని ప్రోత్స­హిం­చేందుకు పాలసీ కూడా రూపొందించి­నట్లు తెలి­పారు.

ఆ తరహా ప్రాజెక్టులకు ఎర్ర­వరం, కురికుట్టి, సోమశిల, అవుకు లాంటి చోట్ల ఏర్పాట్లు జరుగుతున్న నేప­థ్యంలో వాటికి అనుమతులు ఇవ్వా­లని కోరారు. వైఎస్సార్‌ జిల్లా గండికోట వద్ద 1,000 మెగావాట్ల పం­ప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుకు పర్యావరణ అను­మతులు కోసం ఇప్పటికే కేంద్ర అటవీ పర్యా­వరణ శాఖకు ప్రతిపాదనలు పంపినట్లు గుర్తు చేశారు. వీటితో పాటు లోయర్‌ సీలేరు హైడ్రో పవర్‌ ప్రాజెక్టు (230 మెగావాట్లు), అప్పర్‌ సీలేరు పంప్డ్‌ స్టోరేజీ పవర్‌ ప్రాజెక్టుల (1,350 మెగావాట్లు)  పర్యా­వరణ అనుమ­తుల కోసం దరఖాస్తు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర ఉజ్వల ప్రగతికోసం చేపట్టిన ఆయా ప్రాజె­క్టులన్నింటికీ అవసర­మైన పర్యా­వరణ అనుమతులు త్వరగా మంజూరు చేయా­లని కేంద్రమంత్రికి సీఎం జగన్‌ విజ్ఞప్తి చేశారు.

3 పోర్టులు.. 9 ఫిషింగ్‌ హార్బర్లు
‘‘ఏపీ 974 కిలోమీటర్ల విస్తారమైన తీరప్రాంతంతో అపారమైన ఆర్థిక కార్యకలాపాలకు అనువుగా ఉందని సీఎం జగన్‌ కేంద్రమంత్రికి తెలిపారు. రామా­య­పట్నం, మచిలీప­ట్నం, భా­వ­­నపాడులో మూడు గ్రీన్‌ ఫీల్డ్‌ పోర్టులను అభి­వృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. దీంతోపాటు తీరప్రాంతంలో 10 లక్షల మంది మత్స్యకారుల కుటుంబాలను ఆదుకునేందుకు 9 వ్యూహాత్మక ప్రదే­శాలలో ఫిషింగ్‌ హార్బర్‌ల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలి­పారు.

రామా­య­పట్నం ఓడరేవు పనులు శరవే­గంగా జరుగు­తున్నాయని, 2024 మా­ర్చి నాటికి పోర్టు కార్యకలా­పాలు కూడా ప్రారంభం కానున్నా­య­­న్నారు. మచి­లీ­పట్నం, భావన­పాడు పోర్టులకు ప­ర్యా­వరణ అను­మతుల కోసం దర­ఖాస్తు చేసుకుని అవసర­మైన స­మాచారాన్ని కూడా అందజేశామ­న్నారు. ఈ పను­లను వేగంగా ప్రారంభించేందుకు వీలు­గా అనుమ­తులిచ్చి సహకారం అందించాలని కోరారు. 

మరిన్ని వార్తలు