పారిశ్రామిక రంగ ప్రగతిలో ఎంఎస్‌ఎంఈలది కీలక పాత్ర: సీఎం జగన్‌

5 Jun, 2023 16:51 IST|Sakshi

విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సులో ఒప్పందాలు అమలుపై సీఎం.జగన్ సమీక్ష

శాఖల వారీగా కుదుర్చుకున్న ఒప్పందాలు, ప్రస్తుతం వాటి పరిస్థితులపై సమగ్ర సమీక్ష

అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చిన సీఎం జగన్‌

సాక్షి, అమరావతి: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో వచ్చిన పెట్టుబడులపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష చేపట్టారు. ఈజ్‌ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్‌లో వరుసగా నంబర్‌ ఒన్‌ స్థానంలో నిలుస్తున్నామని అధికారులు వెల్లడించగా, జీడీఎస్‌డీపీలో రాష్ట్ర పారిశ్రామిక రంగం దాదాపు రూ.13లక్షల కోట్ల వాటా కలిగి ఉందని, పారిశ్రామికరంగం వాటా 21శాతం నుంచి 23శాతానికి పెరిగిందని స్పష్టం చేశారు. 

2022 జనవరి – డిసెంబరు మధ్యకాలంలో రూ.45,217 పెట్టుబడులు వచ్చాయని వెల్లడించిన అధికారులు..  2022-23లో రూ.1.6లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు రాష్ట్రం నుంచి ఎగుమతి అయ్యాయని తెలిపారు.ఈ సందర్భంగా సీఎం జగన్‌ అధి​కారులకు కొన్ని సూచనలు చేశారు. 

సీఎం వైఎస్‌ జగన్‌ కామెంట్స్‌

పారిశ్రామిక రంగ ప్రగతిలో MSMEలది కీలక పాత్ర

ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు కూడా ఈ రంగంలోనే ఉన్నాయి

ఎంఎస్‌ఎంఈలకు ప్రభుత్వం మార్గదర్శకంగా వ్యవహరించాలి

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ ఉన్న ఉత్పత్తులు ఏంటి? వాటి ఉత్పత్తిని సాధించడానికి MSMEలకు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానం? ఉత్పత్తి అయిన వస్తువులకు అంతర్జాతీయంగా ప్రముఖ బహుళజాతి సంస్థలతో అనుసంధానం? ఈ మూడు అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి

 MSMEలకు అవసరమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందేలా చూడాలి

పరిశ్రమల శాఖలో MSMEఎంఎస్‌ఎంఈలకోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి

ఈ విభాగానికి ఒక కార్యదర్శిని కూడా నియమించాలి

రాష్ట్రం నుంచి బహుళ ఉత్పత్తులు, బహుళ దేశాలకు ఎగుమతులు లక్ష్యంగా ముందుకు సాగాలి

 ఈ సమీక్షా సమావేశానికి పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ విజయానంద్, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, మార్కెటింగ్, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ ప్రవీణ్ కుమార్, టూరిజం సీఈవో కన్నబాబు, ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్, ఎన్ఆర్ఈడీసీఏపీ వీసీ అండ్ ఎండీ ఎస్.రమణా రెడ్డి, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ అమరేంద్ర కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.


చదవండి: ఒడిశా రైలు ప్రమాదం: బాధితులకు ఏపీ ప్రభుత్వ భరోసా

మరిన్ని వార్తలు