ఓటీఎస్‌తో రూ.10 వేల కోట్లు రుణాలు మాఫీ 

2 Dec, 2021 03:38 IST|Sakshi

సాక్షి, అమరావతి: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (ఓటీఎస్‌)పై దుష్ప్రచారాన్ని సీరియస్‌గా తీసుకోవాలని, అటువంటి ప్రచారం చేసే వారిపై కఠినంగా ఉండాలని సీఎం వైఎస్‌ జగన్‌ బుధవారం అధికారులను ఆదేశించారు. ఓటీఎస్‌ పథకం ద్వారా లక్షల మంది పేదలకు లబ్ధి కలుగుతుందని, చట్టపరంగా హక్కులు దఖలు పడతాయన్నారు. ఈ పథకంపై దురుద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

చదవండి: సిరివెన్నెల కుటుంబానికి అండగా నిలిచిన సీఎం జగన్‌

లబ్ధిదారుల్లో సందేహాలు ఉంటే ఒకటికి రెండుసార్లు అవగాహన కల్పించాలన్నారు. పథకం ద్వారా వచ్చే లబ్ధిని, రిజిస్టర్డ్‌ పత్రాల ద్వారా వారికి మాఫీ అవుతున్న అసలు, వడ్డీ వివరాలను చూపించాలన్నారు.  సీఎం కార్యాలయ అధికారులతో జరిగిన సమావేశంలో సీఎం ఈ ఆదేశాలిచ్చారు. 

చదవండి: ఇది బలవంతపు పథకం కాదు: బొత్స సత్యనారాయణ

మరిన్ని వార్తలు