చంద్రబాబు.. రామోజీరావు.. లేదంటే వారిద్దరిలో ఎవరు కొంటారో చెప్పాలి?

15 Sep, 2022 20:01 IST|Sakshi

సాక్షి, అమరావతి: అమరావతిలో భూముల ధరలపై ఎల్లోమీడియాలో వస్తున్న అబద్ధపు, భిన్న కథనాలకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా బట్టబయలు చేశారు. సీఎం జగన్‌లో అసెంబ్లీలో ప్రసంగిస్తూ.. 'అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ రాజధాని అని దుష్టచతుష్టయం అంటోంది. రాజధానిలో 5,020 ఎకరాలు.. ఎకరా రూ.20కోట్ల చొప్పున అమ్ముతామన్నారు. 5020 ఎకరాల అమ్మకం ద్వారా లక్ష కోట్లు వస్తే రాజధాని అభివృద్ధి చేస్తామన్నారు.

ఎకరానికి రూ.20కోట్లు పెట్టి ఎవరైనా కొంటారా?. నిజంగా ఇంత ధరకు చంద్రబాబు కొంటారా?. రామోజీరావు కొంటారా? లేదంటే రాధాకృష్ణ కానీ టీవీ5 నాయుడు కానీ కొంటారా?. పైగా ఇదే ఎల్లో మీడియానే ఈ మధ్య రాజధానిలో ఎకరా రూ.10కోట్లు పెట్టి కొంటారా అంటోంది. ఎకరాకు రూ.20 కోట్లకు అమ్ముతామని మీరే అంటారు. తిరిగి రూ.10 కోట్లకు ఎవరు కొంటారని మీరే ప్రచారం చేస్తారు. రాజధాని భూములకు అంత ధర లేదు అని మీరు చెప్తున్నప్పుడు ఈ ప్రాజెక్ట్‌ను ఎలా పూర్తి చేస్తారో ప్రజలకు తెలియజేయాలి. 

చదవండి: (సీఎం జగన్‌ సెటైర్లు.. 'పచ్చళ్లు అమ్మినా అది మావారే అయ్యుండాలి')

అమరావతికి పెట్టే దానిలో కేవలం 10 శాతం విశాఖలో పెడితే చాలు ఎంతో అభివృద్ధి చెందుతుంది. విశాఖపట్నం అని నేను ఎందుకు చెప్తున్నానంటే.. అక్కడ ఇప్పటికే అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. కొద్దిగా మెరుగులు దిద్దితే చాలు. నాకు అన్ని ప్రాంతాల ప్రజలు సమానమే. ఏపీలో అతిపెద్ద నగరం విశాఖపట్నం. మేం చేస్తామన్న విశాఖలో అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. అమరావతిలో చంద్రబాబు చేయలేని దానిని మమ్మల్ని చేయమంటూ డ్రామాలాడుతున్నారు.

పోనీ ఆయన కోరుకుంటున్న విజయవాడ ఆయన ఏం చేశాడని అడిగితే అదీ శూన్యం. అమరావతిలో బినామీ భూముల ధరలు పెరిగేందుకు విజయవాడ, మంగళగిరి అభివృద్ధిని అడ్డుకున్నారు. చంద్రబాబు కనకదుర్గ ఫ్లైఓవర్‌ను కూడా పూర్తి చేయలేకపోయారు. మేం వచ్చాక రెండు ఫ్లైఓవర్‌లు పూర్తి చేశాం. ఐదేళ్లు అధికారంలో ఉండి కృష్ణలంక రిటైనింగ్‌ వాల్‌ నిర్మించలేకపోయారు. మేం వచ్చాక రిటైనింగ్‌ వాల్‌ నిర్మించడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారు. చివరకు కరకట్టపై అక్రమ నివాసంలో ఉండి దాన్ని కూడా విస్తరించలేకపోయారు. స్వార్థ రాజకీయాల కోసం ఇంత దిగజారాలా?. అందరూ బాగుండాలని కోరుకుంటే అది సమాజం. ఇంటింటికీ, మనిషిమనిషికీ మంచి చేయాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం' అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

చదవండి: (అశ్వనీదత్‌, రాఘవేంద్రరావు కోరుకున్న చోట భూములు: కొడాలి నాని)

మరిన్ని వార్తలు