పింగళి వెంకయ్య 146వ జయంతి.. సీఎం జగన్‌ నివాళులు

2 Aug, 2022 11:03 IST|Sakshi

సాక్షి, అమరావతి: జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 146వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు. తెలుగు బిడ్డ పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని రూపొందించి దేశ ప్రజలందరూ గర్వపడేలా చేశారని సీఎం జగన్‌ అన్నారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు. ‘దేశ ప్ర‌జ‌లంద‌రూ గ‌ర్వ‌ప‌డేలా జాతీయ పతాకాన్ని రూపొందించిన మ‌న తెలుగు బిడ్డ పింగ‌ళి వెంక‌య్య‌గారి జ‌యంతి సంద‌ర్భంగా నివాళులు. కుల‌, మ‌త, ప్రాంతాల‌క‌తీతంగా త్రివ‌ర్ణ ప‌తాకాన్ని గుండెల నిండా పెట్టుకున్న దేశ ప్ర‌జలంద‌రికీ సెల్యూట్ చేస్తున్నా’ అని పేర్కొన్నారు.

కాగా ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని సీఎం జగన్‌ ఆవిష్కరించారు. అలాగే పింగళి వెంకయ్య జీవిత చరిత్రపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం ప్రారంభించారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు