నవంబర్‌ 4న ఏలూరుకు సీఎం వైఎస్‌ జగన్‌

31 Oct, 2020 18:52 IST|Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి : నవంబర్ 4వ తేదిన ఏలూరులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. ఆ రోజు తంగెళ్లమూడి వద్ద రిటైనింగ్‌ వాల్‌ శంకుస్థాపన చేసిన అనంతరం మాజీ మేయర్‌ నూర్‌ జహన్‌ పెద్దబాబు  కుమార్తె వివాహానికి హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని ఏర్పాట్లను పరిశీలించారు. ఆయనతోపాటు జిల్లా కలెక్టర్ రేవు ముత్యాల రాజు, జిల్లా ఎస్పీ నారాయణ నాయక్, ఎమ్మెల్యే అబ్బాయ చౌదరి.కూడా ఉన్నారు. చదవండి: పోలవరంపై ప్రధానికి సీఎం జగన్‌ లేఖ 

ఆ సందర్భంగా ‌ఉపముఖ్యమంత్రి ఆళ్లనాని మాట్లాడుతూ.. ఏలూరు నగరానికి వరద ముంపు తప్పించేందుకు నాడు దివంగత నేత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిధులను కేటాయించారని పేర్కొన్నారు. వైఎస్ హయాంలో నలబై శాతం రిటైనింగ్ వాల్ నిర్మించినట్లు తెలిపారు. వైఎస్‌ మరణానంతరం ఏ ముఖ్యమంత్రి కూడా చొరవ చూపలేదని, నేడు ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సహాకారంతో మిగిలిన పనులకు శ్రీకారం చుట్టినల్లు తెలిపారు. రూ. 78 కోట్ల నిధులతో నిర్మించే రిటైనింగ్ వాల్‌కు ఈ నెల నాలుగవ తేదిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. 

మరిన్ని వార్తలు