రూ.240 కోట్లతో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి.. శంకుస్థాపనకు సీఎం జగన్‌ 

30 Apr, 2022 20:56 IST|Sakshi

సాక్షి, తిరుపతి: చిన్నపిల్లలకు అధునాతన వైద్యం అందించేందుకు టీటీడీ ఆధ్వర్యంలో సుమారు రూ.240 కోట్లతో నిర్మించనున్న చిన్నపిల్లల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి మే 5న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్టు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. టాటా ట్రస్టు నిర్మించిన శ్రీవేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్యాన్సర్‌ కేర్‌ అండ్‌ రీసెర్చి ఆస్పత్రిని, బర్డ్‌లో స్మైల్‌ ట్రైన్‌ వార్డును, మొదటి విడతలో పూర్తయిన శ్రీనివాససేతును ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని తెలిపారు.

ఆయన శుక్రవారం ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, జేఈవో వీరబ్రహ్మంతో కలిసి ఆస్పత్రి స్థలాన్ని, టాటా క్యాన్సర్‌ ఆస్పత్రిని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం ఆదేశాల మేరకు బర్డ్‌ ఆస్పత్రి ప్రాంగణంలో తాత్కాలికంగా శ్రీపద్మావతి హృదయాలయాన్ని ప్రారంభించామని, ఆరునెలల్లో 300 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేశామని చెప్పారు.  

చదవండి: (తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్‌.. టీటీడీ కీలక నిర్ణయాలు ఇవే..)

మరిన్ని వార్తలు