CM Jagan: చీమకుర్తిలో పర్యటించనున్న సీఎం జగన్‌

18 Aug, 2022 17:37 IST|Sakshi

సాక్షి, ప్రకాశం జిల్లా: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 24న చీమకుర్తిలో పర్యటించనున్న నేపథ్యంలో వైఎస్సార్‌ సీపీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ బాలినేని శ్రీనివాసరెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్‌ దినేష్‌ కుమార్, ఎస్పీ మలికాగార్గ్‌ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. జాయింట్‌ కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్, ఏఎస్‌పీ నాగేశ్వరరావు ఏర్పాట్ల పరిశీలనలో పాల్గొన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహాలను ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. దానితో పాటు బహిరంగ సభ కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం హెలికాప్టర్‌ దిగేందుకు అనువైన ప్రదేశాన్ని పరిశీలించారు. బూచేపల్లి ఇంజినీరింగ్‌ కాలేజీ, ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ ఆవరణలను పరిశీలించారు. బూచేపల్లి కల్యాణ మండపం పక్కనే చీమకుర్తి మెయిన్‌రోడ్డులో ఇప్పటికే నిర్మాణం పూర్తి కావస్తున్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి, బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహాలను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభిస్తారు.

అనంతరం బీవీఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో బహిరంగ సభ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పరిశీలించారు. అనంతరం బీవీఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో అధికారులతో బాలినేని, బూచేపల్లి ఆధ్వర్యంలో సీఎం జగన్‌ పర్యటనను విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ సభ్యులు వేమా శ్రీనివాసరావు, క్రిష్టిపాటి శేఖరరెడ్డి, స్థానిక కౌన్సిలర్‌లు, వైఎస్సార్‌ సీపీ నాయకులు పాల్గొన్నారు.   

చదవండి: (సోనియాగాంధీ వద్దకు కోమటిరెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి!)

మరిన్ని వార్తలు