ఏపీ సంక్షేమం అన్ని రాష్ట్రాలకూ ఆదర్శం: యూపీ సీఎం స్పెషల్‌ అడ్వైజర్‌

25 Jan, 2023 05:02 IST|Sakshi

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు విపవాత్మకం అని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి ప్రత్యేక సలహాదారు సాకేత్‌ మిశ్రా అభివర్ణించారు. దీనిని గొప్ప కాన్సెప్ట్‌గా భావిస్తు­న్నానని ప్రశంసించారు. వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో ఏపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, మెరుగు పరుస్తున్న తీరును స్వయంగా పరిశీలించానని, ప్రగతి స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. చివరి వ్యక్తికి కూడా లబ్ధి చేకూర్చడానికి ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించక తప్పద­న్నారు.

మంగళవారం ఆయన కృష్ణా జిల్లా పెనమ­లూరు మండలం వణుకూరులో గ్రామ సచివా­లయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్‌ సెంటర్, డాక్టర్‌ వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవా కేంద్రాల పనితీరును స్వయంగా పరిశీలించారు. ఆ తర్వాత సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తన అభిప్రాయాలను వైఎస్‌ జగన్‌తో పంచుకున్నారు. అనంతరం ఐఅండ్‌పీఆర్‌ ప్రతినిధు­లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

ఏపీని చూసి చాలా నేర్చుకోవచ్చు
ఏపీలో పర్యటన మాకు మంచి అనుభవాన్ని ఇచ్చింది. ఏపీలో అమలవుతున్న పథకాలు, కార్యక్రమాల వెనుక లక్ష్యాలు, ఉద్దేశాలపై సీఎంతో చర్చించాను. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో భాగంగా వారి ఆరోగ్య చరిత్రను నిక్షిప్తం చేయడం బాగుంది. దీనికి ఐటీ, ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించడం ప్రశంసనీయం. ఏపీలో అమలు చేస్తు­న్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఇతర రాష్ట్రా­లకు తెలిసేలా చర్యలు తీసుకోవాలి.

గ్రామంలో ప్ర­భుత్వ సేవలపై ఎవరికి ఏ అవసరం వచ్చినా పలు రకాల ఆఫీసుల చుట్టూ తిరిగేకన్నా, గ్రామ సచి­వాలయం కేంద్రంగా అన్నింటికీ పరిష్కారం లభించడం విప్లవాత్మక ప్రగతిగా భావిస్తున్నా. ఏపీ పర్య­టన ద్వారా చాలా నేర్చుకున్నాం. డ్రోన్‌ల వ్యవస్థ ఆకట్టుకుంది 10 నిమిషాల్లో ఎక­రంలో పురుగు మందు పిచికారి చేయడం గొప్ప విషయం. ఆర్బీ­కేల ద్వారా రైతులకు ఎన్నో విధాలా ఉపయో­గం ఉంది. ఎరువులు, పురుగు మందులు, ఈ–క్రాప్, నష్టపరి­హారం ఇలా ఎన్నో విషయాల్లో ఏపీ ప్రభు­త్వం రైతులకు అండగా నిలవడం అభినందనీయం.    


ఇక తాజాగా ఏపీ సీఐడీ కొత్త డీజీగా నియమితులైన ఎన్‌.సంజయ్‌ సైతం ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. 

ఇదీ చదవండి: కేవలం 9 నిమిషాల్లో ఆరోగ్యశ్రీ కార్డు

మరిన్ని వార్తలు