CM YS Jagan Birthday: పేదోడి కోసం ఓ సీఎం ఇంతలా పరితపిస్తారా?..దట్‌ ఈజ్‌ జగనన్న

19 Dec, 2022 21:12 IST|Sakshi

సాక్షి, ప్రత్యేకం: ఈ మూడున్నరేళ్ల కాలంలో ఏపీ ప్రజలు, ప్రత్యేకించి పేదల బతుకు చిత్రాన్ని మార్చేసేందుకే సీఎం వైఎస్‌ జగన్‌ అహర్నిశలు కృషి చేశారు.. చేస్తున్నారు. అర్హులకు సంక్షేమ ఫలాలను అందించడంతో పాటు ఆపదలో ఉన్నవాళ్లెందరినో సత్వరమే ఆదుకున్న మంచి మనసు ఆయనది. ఈ మాట స్వయంగా సాయం అందుకున్న వాళ్ల నోటి నుంచే వెలువడుతోంది మరి!. అయితే.. ఆ తల్లిదండ్రులు సీఎం జగన్‌ మనసున్న మారాజు అని కృతజ్ఞతలు చెబుతున్నారు. ఎందుకో తెలుసా?

ఆడిపాడే వయసులో ఆ చిట్టితల్లికి పెద్ద కష్టమే వచ్చింది. అది ఆమె తల్లిదండ్రులు కూడా మోయలేనంతది!.  హనీకి వచ్చిన పెద్దజబ్బుకు చికిత్స చేయడం తమకు చేతకాదనుకున్న ఆ అమ్మానాన్న.. దేవుడిపై భారం వేశారు. కానీ, ఆ దేవుడు ఎప్పటిలాగే మనిషి రూపేణా వచ్చాడు. కష్టం గురించి తెలియగానే.. సీఎం జగన్‌ శరవేగంగా స్పందించారు.  ఆ చిట్టితల్లికి బతుకు భరోసా కల్పించారు. ఆ కుటుంబంలో వెలుగులు నింపారు. 

పశ్చిమగోదావరి జిల్లా అచంట మండలం అయోధ్యలంక గ్రామానికి చెందిన రాంబాబు, నాగలక్ష్మి దంపతులు కుమార్తె హనీ. పుట్టుకతోనే ఈ పాపకు గౌచర్‌ అనే వ్యాధి వచ్చింది. ఈ వ్యాధి వచ్చిన వారిలో కాలేయం పనిచేయదు. చికిత్స కోసం లక్షల్లో ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. అత్యంత అరుదైన ఈ వ్యాధితో దేశంలో 14 మంది బాధితులు బాధపడుతుండగా..  రాష్ట్రంలో చిన్నారి హనీ తొలి బాధితురాలు.  ఏమి చెయ్యాలో ఈ తల్లిదండ్రులకు పాలుపోలేదు. గోదావరి వరద బాధిత ప్రాంతాల పర్యటనలో భాగంగా, సీఎం జగన్‌ కోనసీమకు వెళ్లారు. అక్కడ కిక్కిరిసిన జనం మధ్య పాపను ఎత్తుకుని తనను కలవడానికి ప్రయత్నిస్తున్న ఈ అమ్మానాన్నలు ఆయన కంటపడ్డారు. కాన్వాయ్‌ని ఆపించి, తల్లి వద్దకు వెళ్లి సమస్యను అడిగి తెలుసుకున్నారు.  

చిన్నారికొచ్చిన కష్టం గురించి ఈ అమ్మానాన్నలు ఆయనకు వివరించారు. దీంతో చలించిపోయిన సీఎం జగన్‌..ఆ పాప వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. అలా  పసిబిడ్డ హనికి ప్రాణం పోశారు. ‘‘సీఎంగారి ఆదేశాల మేరకు చిన్నారిని చదివించే బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకుంది. అలాగే బాలిక కుటుంబానికి నెలకు రూ.10వేల చొప్పున పెన్షన్‌ కూడా మంజారు చేసింది. హనీ గౌచర్‌ వ్యాధికి సంబంధించిన 52 ఇంజక్షన్లను మంజూరు చేశారు. ఒక్కో ఇంజక్షన్‌ ఖరీదు రూ.1,25,000 కాగా, కంపెనీతో సంప్రదింపులు జరిపి, వాటిని తెప్పించారు. ప్రతి 15 రోజులకు ఒక ఇంజక్షన్‌ క్రమం తప్పకుండా చిన్నారికి ఇస్తున్నారిప్పుడు. తాము జన్మనిచ్చినా.. బతకదనుకున్న తమ బిడ్డకు సీఎం జగన్‌ పునర్జన్మనిచ్చారు. ఆయన బాగుండాలని తిరుమలకు పాదయాత్ర సైతం చేశారు. హనీ.. ఇప్పుడు హ్యాపీ.. హ్యాపీ..  


పేదోడి కోసం ఓ ముఖ్యమంత్రి ఇంతలా పరితపిస్తారా.. 
మా పాపకు ప్రాణం దానం చేసిన సీఎం జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం. ఆ రోజు కాన్వాయ్‌లో సీఎం జగనన్న మమ్మల్ని చూసి ఆగడం.. మా పాప అనారోగ్యం గురించి తక్షణమే స్పందించి కలెక్టర్‌కు చెప్పడం, ఇప్పుడు రూ.లక్షల విలువైన వైద్యం అందించడం చూస్తుంటే.. ఓ సీఎం ఇంతలా ఓ పేదవాడి కోసం తపిస్తారా.. అని ఆశ్చర్యమేస్తోంది. మా బిడ్డను ఆదుకుని మాపాలిట దైవంలా నిలిచిన జగనన్నకు చేతులెత్తి దండాలు పెడుతున్నాం.
–  తొలి ఇంజెక్షన్‌ అందుకున్న వేళ తల్లిదండ్రులు రాంబాబు, నాగలక్ష్మి భావోద్వేగం 

:::YS Jagan పుట్టినరోజుపై ప్రత్యేక కథనం

మరిన్ని వార్తలు