వెంటనే ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వండి: సీఎం జగన్‌

19 Oct, 2020 19:56 IST|Sakshi

వరద ప్రబావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే

సాక్షి, అమరావతి: భారీ వరదలు, వర్షాలు వల్ల తీవ్రంగా దెబ్బ తిన్న ప్రాంతాల్లో పంట నష్టంపై వెంటనే అంచనాలు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలని, రబీలో పంట పెట్టుబడికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. భారీ వర్షాలు, వరద బీభత్సం నేపథ్యంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే నిర్వహించారు. నందిగామ, అవనిగడ్డ, పెనమలూరు, మైలవరం, తాడికొండ తదితర నియోజకవర్గాల పరిధిలోని ముంపు ప్రాంతాలను, దెబ్బ తిన్న వ్యవసాయ, ఉద్యాన పంటలను పరిశీలించారు. (చదవండి: అవినీతి లేకుండా పారదర్శక విధానం: సీఎం జగన్‌)

అదే విధంగా, భారీ వరదల వల్ల లంక భూములు, నదీ పరీవాహక ప్రాంతాల్లో ఇరువైపులా తీవ్రంగా దెబ్బ తిన్న పంటలను పరిశీలించిన సీఎం, మిగిలిన జిల్లాల్లో కూడా వరదల్లో మునిగిన పంటలతో పాటు, ఇళ్లు, పశువులు నష్టపోయిన వారిని గుర్తించి వెంటనే పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. ఏరియల్‌ సర్వే నిర్వహిస్తున్న సమయంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, మంత్రి కొడాలి నాని సీఎం జగన్‌ వెంట ఉన్నారు. కాగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణ, గుంటూరు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే 5 నిత్యావసర సరుకులతో ప్రభుత్వం, వరద బాధితులకు ఉచిత రేషన్‌ అందిస్తున్న విషయం తెలిసిందే.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా