రాయదుర్గం చేరుకున్న సీఎం జగన్‌

8 Jul, 2021 09:37 IST|Sakshi

అనంతపురం, వైఎస్సార్‌ జిల్లాల్లో సీఎం పర్యటన

సాక్షి, విజయవాడ: గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. అనంతపురం జిల్లా రాయదుర్గం చేరుకున్నారు. గురు, శుక్రవారాల్లో రెండు రోజుల పాటు వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో పర్యటించి రైతు సంక్షేమాన్ని కాంక్షిస్తూ పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సీఎం జగన్‌ శ్రీకారం చుట్టనున్నారు. రాయదుర్గం నియోజకవర్గం ఉడేగోళం గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌ యూనిట్స్‌ పరిశీలిస్తారు. అనంతరం రాయదుర్గం మార్కెట్‌ యార్డులో వైఎస్సార్‌ ఇంటిగ్రెటెడ్‌ అగ్రి ల్యాబ్‌ ప్రారంభించి, లబ్ధిదారులతో మాట్లాడతారు.

11.45 – 1.10 గంటలకు విద్యార్థి పాఠశాలలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అక్కడి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 2.10 గంటలకు వైఎస్సార్‌ జిల్లా పులివెందులలోని భాకరాపురం చేరుకుంటారు. 2.50 – 3.20 గంటలకు పులివెందులలోని ఇంటిగ్రెటెడ్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ గ్రౌండ్‌లో వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేస్తారు. శిలాఫలకాలు ఆవిష్కరిస్తారు. 3.55 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఎస్టేట్‌ చేరుకుంటారు. 4.10 – 4.55 గంటలకు వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. రాత్రికి అక్కడి గెస్ట్‌హౌస్‌లో బస చేస్తారు.  

మరిన్ని వార్తలు