రైలు ప్రమాద బాధితులకు అండగా నిలిచిన సీఎం జగన్‌.. పరిహారం వివరాలు ఇవే..

4 Jun, 2023 12:56 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ఒడిశాలోని బాలాసోర్‌ వద్ద ఘోర రైలు ప్రమాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో బాధితులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. కాగా, బాలాసోర్‌ ప్రమాదంలో శ్రీకాకుళానికి చెందిన గురుమూర్తి మృతిచెందారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు అండగా నిలుస్తూ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. 

ఒడిశా రైలు ప్రమాదం ఘటనలో సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రైలు ప్రమాదంలో మృతిచెందిన గురుమూర్తి కుటుంబానికి రూ.10లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇదే సమయంలో తీవ్రంగా గాయపడిన వారికి రూ.5లక్షల చొప్పున పరిహారం ఇ‍వ్వాలన్నారు. స్వల్పంగా గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. కేంద్రం సాయానికి అదనంగా పరిహారం ఇవ్వాలని సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. 

ఇది కూడా చదవండి: AP: రైలులో ప్రయాణించిన వాళ్ల ఫొటో, వివరాలు వాట్సాప్‌ చేయండి.. నెంబర్‌ ఇదే..

మరిన్ని వార్తలు