ఎల్లో పార్టీ, మీడియాల కడుపు మంటకు మందే లేదు: సీఎం జగన్‌

8 Apr, 2022 13:36 IST|Sakshi

సాక్షి, నంద్యాల: పిల్లలకి ఇచ్చే చిక్కీపై సీఎం బొమ్మ ఉందంటూ చిల్లర రాజకీయాలతో రాద్ధాంతం చేస్తున్న ఘనత చంద్రబాబునాయుడు, ఎల్లో మీడియాదేనని ఎద్దేవా చేశారు సీఎం జగన్‌. నంద్యాల జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ప్రతీ ఇంటి మేనమామగా పిల్లలను చదివించే బాధ్యత తనదని మరోసారి తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. 

ఎల్లో పార్టీ కడుపు మంట, అసూయకు మందే లేదని.. చివరికి పిల్లలకు అందుతున్న సంక్షేమ పథకంపై కూడా అక్కసు వెల్లగక్కుతున్నారంటూ జాలిపడ్డారు సీఎం జగన్‌. గత ప్రభుత్వం హయాలంలో తక్కువగా ఉన్నజీఈఆర్‌ రేషియో, ప్రభుత్వ బడులలో చదువుతున్న పిల్లల సంఖ్యను.. పెంచిన ఘనతను తమ ప్రభుత్వానిదేనని, ఇది గమనించమని ప్రజలను కోరారు సీఎం జగన్‌. 

నాడు-నేడుతో బడుల రూపురేఖలను మారుస్తూ.. సర్కారీ బడులకు మంచి రోజులు తీసుకొచ్చామని సీఎం జగన్‌ తెలిపారు. చేస్తున్న మంచేది ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, యెల్లో మీడియాకు పట్టట్లేదని, పార్లమెంట్‌ వేదికగా చేసుకుని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు జేసేందుకు ప్రయత్నిస్తున్న గొప్ప ఘనత వాళ్లదన్నారు. 

ఎక్కడైనా ప్రతిపక్షాలు అనేవి రాష్ట్రం పరువు కోసం ఆరాటపడతాయని.. కానీ, మన రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యమైన ఏంటంటే.. ఇలాంటి ప్రతిపక్ష నేత.. ఆయన దత్త పుత్రుడు, యెల్లో మీడియాలు ఉండటం.. పరువు తీయడం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇవేవీ తనను బెదిరించలేవని, ప్రజల దీవెనలతో ‘జగన్‌ అనే నేను’ ఈ స్థానంలోకి వచ్చానని గుర్తు చేశారాయన. దేవుడి దయతో మరింత మంచి చేసే అవకాశం కలగాలని మనసారా కోరుకుంటున్నట్లు  సీఎం జగన్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు