ఏం మాట్లాడుతున్నారో తెలుసా.. టీడీపీపై మండిపడ్డ సీఎం జగన్‌

15 Mar, 2022 12:51 IST|Sakshi

సాక్షి, అమరావతి: అసెంబ్లీలో టీడీపీ సభ్యులు హుందాగా ప్రవర్తించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హితవు పలికారు. మంగళవారం ఆయన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ, 55 వేల జనాభా ఉన్న చోట ఎవరైనా సారా కాస్తారా? నిఘా ఎక్కువగా ఉన్న ప్రాంతంలో సారా తయారీ సాధ్యమా అని ప్రశ్నించారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే నమ్మే విధంగా ఉండాలన్నారు.

చదవండి: నువ్వు సినిమాల్లోనే హీరోవి.. నేను పొలిటికల్‌ హీరోని: మంత్రి అవంతి

‘‘సారాపై మా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అక్రమ మద్యం అడ్డుకోవడానికి ప్రత్యేక వ్యవస్థ తెచ్చాం. రెండేళ్లలో 13 వేల కేసులను నమోదు చేశాం. చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆయనకేనా తెలుసా? టీడీపీ సభ్యులు మెదడుకు పదును పెట్టి ఆలోచించాలి. సాధారణ మరణాలపై తప్పుడు రాజకీయం చేస్తున్నారు. కామన్‌ సెన్స్‌ లేకుండా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. అబద్ధాన్ని నిజం చేయడానికి గ్లోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారు. జరగని ఘటన జరిగినట్టుగా విష ప్రచారం చేస్తున్నారు. కొన్ని మీడియా సంస్థలతో కలిసి చంద్రబాబు విష ప్రచారం చేయిస్తున్నారు. జంగారెడ్డిగూడెం ఘటనపై ఇప్పటికే వివరంగా స్టేట్‌మెంట్‌ ఇచ్చాం. సభను అడ్డుకోవడమే లక్ష్యంగా టీడీపీ సభ్యులు ప్రవర్తిస్తున్నారని’’ సీఎం వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు.

మరిన్ని వార్తలు