భూమనను ఫోన్‌లో పరామర్శించిన సీఎం జగన్‌

30 Aug, 2020 19:44 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: కరోనా బారినపడి కోలుకుంటున్న తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ఫోన్‌లో పరామర్శించారు. తాను క్షేమంగా ఉన్నానని ఎమ్మెల్యే భూమన ఈ సందర్భంగా సీఎంకు తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆకాక్షించారు. కాగా, తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో భూమన కరుణాకర్‌రెడ్డి చికిత్స పొందుతున్నారు. ఇక భూమన కుమారుడు అభినయ రెడ్డి కూడా కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
(చదవండి: ఆ లేఖ నా వ్యక్తిగత నిర్ణయం : భూమన)

మరిన్ని వార్తలు