వ్యాక్సిన్‌పై ప్రధానికి లేఖ రాయనున్న సీఎం జగన్‌

4 May, 2021 15:36 IST|Sakshi

సాక్షి, విజయవాడ: వాక్సినేషన్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాయాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. 45 ఏళ్లు పైబడిన వారికి వాక్సినేషన్‌లో ప్రాధాన్యం ఇవ్వాలని  మంత్రిమండలి నిర్ణయించింది. ఈ విషయమై ప్రధానికి సీఎం జగన్‌ లేఖ రాయనున్నారు. మంగళవారం సీఎం అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కరోనా కట్టడి చర్యలు.. వ్యాక్సినేషన్‌పై ప్రధానంగా చర్చించారు. ఆక్సిజన్ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు  తీసుకోవాలని మంత్రిమండలి నిర్ణయించింది. 

కర్ణాటక, ఒరిస్సా, తమిళనాడు నుంచి ఆక్సిజన్‌ రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ ఆదేశించారు. రేపటి నుంచి కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించారు. 12 గంటల తర్వాత ఆర్టీసీ బస్సులు నడపకూడదని నిర్ణయించారు.  ఉదయం 11.30 గంటల వరకే కళాశాలల నిర్వహణకు అవకాశం ఇచ్చారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకే దుకాణాలకు అనుమతి ఇవ్వాలని.. మధ్యాహ్నం నుంచి ప్రజా రవాణా వాహనాలను నిలిపేయాలని మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 12గంటల తర్వాత ఆర్టీసీ బస్సులు, అంతర్రాష్ట్ర సర్వీసులు నిలిచిపోనున్నాయి.

భౌతిక దూరం పాటిస్తూ సమావేశమైన మంత్రివర్గం

>
మరిన్ని వార్తలు