వైఎస్సార్‌సీపీ నేత హత్యపై సీఎం జగన్‌ ఆరా.. ధర్మానకు కీలక ఆదేశాలు

7 Dec, 2022 14:39 IST|Sakshi

సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా గార మండలం ఉపాధ్యక్షులు బరాటం రామశేషు హత్యఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. తక్షణమే గ్రామానికి వెళ్లి ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోవడంతో పాటు రామశేషు కుటుంబానికి అండగా నిలబడాలని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావును సీఎం ఆదేశించారు.

దీంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయవాడలో నిర్వహిస్తున్న బీసీ సదస్సుకు హాజరు కాకుండానే.. పార్టీకి ఎన్నో సేవలందించి హత్యకు గురైన రామశేషు కుటుంబాన్ని పరామర్శించడానికి రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు వెళ్లారు.

చదవండి: (వైఎస్సార్‌సీపీ నేత బరాటం రామశేషు దారుణ హత్య)

కాగా, గార మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు రామశేషు స్థానికంగా పలు వ్యాపారాలు చేస్తున్నారు. గతంలో ఈ గ్రామంలో మూడు దఫాలు సర్పంచ్‌గా కూడా పనిచేశారు. అయితే, పలు వ్యాపారాలు చేస్తున్న క్రమంలో కొందరు వ్యక్తులు ఆరేళ్ల క్రితం కూడా రామశేషుపై దాడి చేశారు. ఆ సమయంలో తీవ్రగాయాలు కాగా కోలుకున్నారు. అయితే, మంగళవారం ఉదయం తన గోడౌన్‌కు స్టాక్‌ వచ్చిందని ఫోన్‌ రావడంతో రామశేషు అక్కడికి బయలుదేరారు. 

ఈ క్రమంలో రోడ్డు మీద కాపుకాసిన గుర్తు తెలియని వ్యక్తులు అతడిని దారుణంగా హత్య చేశారు. తలపై బండిరాయితో కొట్టడంతో రక్తపు మడుగులో అక్కడికక్కమే మృతిచెందాడు. మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. 

మరిన్ని వార్తలు