త్యాగానికి, ధర్మ పరిరక్షణకు ప్రతీక మొహర్రం : సీఎం వైఎస్‌ జగన్‌ 

9 Aug, 2022 08:12 IST|Sakshi

సాక్షి, అమరావతి: ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు ప్రతీక అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మొహర్రం సందర్భంగా సీఎం జగన్‌ సందేశం విడుదల చేశారు.

మహ్మద్‌ ప్రవక్త మనవడు హజ్రత్‌ ఇమామ్‌ హుస్సేన్‌ బలిదానానికి మొహర్రం ప్రతీకగా పేర్కొన్నారు. ఇస్లామిక్‌ క్యాలెండర్లో మొదటి నెల కూడా మొహర్రం అని చెప్పారు. ఈ పవిత్ర సంతాప దినాలు రాష్ట్రంలో మత సమైక్యతకు ప్రతిబింబంలా నిలుస్తాయని ముఖ్యమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.   
చదవండి: (100 శాతం ‘మద్దతు’)

మరిన్ని వార్తలు