సభలో కుట్ర.. సీఎం జగన్‌ ఆగ్రహం

1 Dec, 2020 11:22 IST|Sakshi

సభ్యుల మాటలు వినకుండా టీడీపీ గందరగోళం సృష్టిస్తోంది

వచ్చే ఎన్నికల్లో టీడీపీకి రెండు, మూడు స్థానాలు కూడా రావు

ప్రతిపక్ష టీడీపీపై సీఎం జగన్‌ ఫైర్‌

సాక్షి, అమరావతి : రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రతిపక్ష టీడీపీ సభ్యుల తీరుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుతో పాటు విపక్ష సభ్యులు పదేపదే సభకు అంతరాయం కలిగించడం పట్ల అసంతృప్తి చెందారు. ప్రజా సమస్యలపై కనీస అవగహన లేని విధంగా ప్రతిపక్షం వ్యవహరిస్తోందని సభలో మండిపడ్డారు. కనీస అంశాలపై చర్చించకుండా అసలు అసెంబ్లీకి ఎందుకు వస్తున్నారో కూడా అర్థంకావడంలేదని అన్నారు. ఓవైపు సీఎం ప్రసంగం సాగుతున్నా.. అదిప్రజలకు చేరవద్దనే కుట్రతో సభలో గందరగోళం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో సీఎం ప్రసంగాన్ని అడ్డుకోవడం దారుణమన్నారు. అనవసరమైన అంశాలపై రాద్ధాంతం చేస్తున్నారని సీఎం జగన్‌ విమర్శించారు. (జేసీ దివాకర్‌రెడ్డికి 100 కోట్ల జరిమానా)

అసెంబ్లీ శీతకాల సమావేశాల్లో భాగంగా రెండోరోజు సభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. ‘సభ్యుల మాటలు వినకుండా టీడీపీ గందరగోళం సృష్టిస్తోంది. డిసెంబర్‌ 15న రూ.1227 కోట్ల బీమా చెల్లిస్తున్నాం. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లోనే బీమా చెల్లింపులను చర్చించాం. కేబినెట్‌లోనూ ఆమోదించాం. డిసెంబర్‌ 25న ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నాం. జగన్‌ ఒక మాట చెబితే.. ఆ మాట నిలబెట్టుకుంటాడని ప్రజల్లో విశ్వాసం ఉంది. చంద్రబాబుకు మోసం చేయడమే తెలుసు. టిడ్కోపై చర్చ జరగకూడదనే చంద్రబాబు గందరగోళం సృష్టిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి రెండు, మూడు స్థానాలు కూడా రావు. 

దటీజ్‌ వైఎస్‌ జగన్‌..
తాను ప్రజలకు ఏదైనా హామీ ఇస్తే ఖచ్చితంగా చేసి తీరుతాం. ఆ విధమైన నమ్మకం ప్రజల్లో ఎప్పుడో కలిగింది. ప్రభుత్వంపై ప్రజల్లో ఓ నమ్మకాన్ని కలిగించాం. దటీజ్‌ జగన్‌. చంద్రబాబు ఏదైనా చెప్పాడు అంటే అది చేయడు అనేది క్రెడిబులిటి. మనం చేసే పనుల వళ్ల మనకు క్రెడిబులిటి వస్తుంది. చంద్రబాబు హయాంలో ఇన్సూరెన్స్‌ కట్టాలంటే రైతులు భయపడేవారు. మేం 59 లక్షల 70వేల మంది రైతులను ఇన్సూరెన్స్‌ ప్రీమియం పరిధిలోకి తీసుకొచ్చాం. రైతుల తరఫున ప్రభుత్వమే ప్రీమియం చెల్లించే బాధ్యత తీసుకుంది. 2019లో రైతులు, రాష్ట్రప్రభుత్వం తరఫున రూ.1030 కోట్లు చెల్లించాం. డిసెంబర్‌ 15న రూ.1227 కోట్లు బీమా ప్రీమియం చెల్లిస్తున్నాం’ అని అన్నారు. 

నిమ్మల సస్పెండ్‌
మరోవైపు సభలో టీడీపీ సభ్యులపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు సభకు ఆటంకం కలిగిస్తున్నారని మండిపడ్డారు. ఎవరి సీట్లలో వారు కూర్చోవాలని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా.. కనీసం ఆయన మాటాలను పట్టించుకోలేదు. సభ సజావుగా సాగేందుకు టీడీపీ సభ్యులు సహకరించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా.. పట్టించుకోలేదు. దీంతో టీడీపీ సభ్యుడు నిమ్మల రామానాయుడును ఒక్కరోజు పాటు సభ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా