గురువర్యా.. ఇదిగో మీ కళ్లజోడు!

6 Sep, 2022 07:04 IST|Sakshi
కింద పడిన ప్రధానోపాధ్యాయుడి కళ్లజోడును పైకి తీస్తున్న సీఎం జగన్‌ 

సాక్షి, విజయవాడ/చీరాల అర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన గురుపూజోత్సవంలో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన ఉపాధ్యాయులకు సీఎం వైఎస్‌ జగన్‌ అవార్డులను అందజేస్తుండగా.. అవార్డు అందుకుంటున్న బాపట్ల జిల్లా చీరాల రూరల్‌ మండలం ఈపూరుపాలెం జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మొలబంటి వెంకటేశ్వర్లు కళ్ల జోడు కింద పడిపోయింది. ఆ విషయం గమనించిన సీఎం జగన్‌.. దానిని చేత్తో పైకి తీసి, ఆ ప్రధానోపాధ్యాయుడి జేబులో పెట్టారు. ఓ గురువు పట్ల సీఎం వినయం ప్రదర్శించిన తీరును అక్కడ ఉన్న వారంతా ప్రశంసించారు.

చదవండి: (రాష్ట్రంలోనే క్యాన్సర్‌కు చెక్‌)

మరిన్ని వార్తలు