పోలీసు అమరుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ

21 Oct, 2021 09:44 IST|Sakshi

సాక్షి, అమరావతి: కోవిడ్‌ విధి నిర్వహణలో అమరులైన కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం 10 లక్షల రూపాయల చెక్కులను అందజేసింది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో గురువారం జరిగిన పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా అమరులైన కుటుంబాలకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెక్కులను అందజేశారు. 

పోలీస్‌ అమరవీరులు సంస్మరణ దినోత్సవ కార్యక్రమానికి హాజరైన సీఎం జగన్‌.. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత అమరులైన పోలీసులకు సీఎం వైఎస్‌ జగన్‌, హోంమంత్రి మేకతోటి సుచరిత, రాష్ట్ర సెక్రటరీ నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే కోవిడ్‌ విధి నిర్వహణలో అమరులైన కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం తరపున 10 లక్షల రూపాయల చెక్కులను సీఎం వైఎస్‌ జగన్‌ అందజేశారు.  కాగా,  2017 నుంచి పెండింగ్‌లో ఉ‍న్న పోలీసు సంక్షేమ గ్రాంట్‌ను అధికారులు సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లగానే 15 కోట్ల గ్రాంట్‌ను మంజూరు చేశారు. తద్వారా దాదాపు 206 కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. 


1. వాసు గారి భార్య శ్రీమతి భాగ్యలక్ష్మీ భవాని గారు 10 లక్షల చెక్కును అందుకున్నారు.


2. శ్రీరాములు (ఏఆర్‌ఎస్సై)గా అమరులయ్యారు. ఆయన భార్య ఝాన్సీరాణి గారు 10 లక్షల చెక్కు అందుకున్నారు. 


3. నాగేశ్వర్‌రావు (ఏఆర్‌ఎస్సై)గా అమరులయ్యారు. ఆయన సతీమణి సి.హెచ్‌.విశ్వశాంతి గారు 10 లక్షల చెక్కును అందుకున్నారు.


4. రామారావు గారి సతీమణి శ్రీమతి లక్ష్మీ గారు 10 లక్షల చెక్కును అందుకున్నారు. 


5. పద్మ(వుమెన్‌ హోంగార్డు)అమరులయ్యారు. ఆమె భర్త టీ. చంద్రశేఖర్‌ గారు 10 లక్షల చెక్కును అందుకున్నారు.


6. ప్రసాద్‌రావు (హెడ్‌ కానిస్టేబుల్‌)అమరులయ్యారు. ఆయన భార్య బి. లక్ష్మీ గారు 10 లక్షల చెక్కును అందుకున్నారు. 


7. సయ్యద్‌ జలాలుద్దీన్‌ (ఏఆర్‌ఎస్పై)అమరులయ్యారు. ఆమె సతీమణి సయ్యద్‌ ఉమే సల్మా గారు గ్రాంట్‌ను అందుకున్నారు. 


8. హరిబాబు గారు అమరులయ్యారు. ఆయన భార్య నిర్మల గారు 10 లక్షల చెక్కును అందుకున్నారు. 

 
9. రత్నంరాజు గారు (హెడ్‌ కానిస్టేబుల్‌)అమరులయ్యారు. ఆయన సతీమణి కె. సుజాతావాణి గారు 10 లక్షల చెక్కును అందుకున్నారు. 

చదవండి: నేటి నుంచి పోలీసులకు వీక్లీ ఆఫ్‌ అమలు: సీఎం జగన్‌

మరిన్ని వార్తలు