రాష్ట్రపతికి సీఎం జగన్‌ ఘన స్వాగతం

7 Feb, 2021 18:46 IST|Sakshi

భారత్‌ యోగా కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్

సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు. సీఎం వెంట మంత్రులు నారాయణ స్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు. రాష్ట్రపతి మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో హెలికాఫ్టర్‌ ద్వారా మదనపల్లెకి సమీపంలోని చిప్పిలిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి మదననపల్లెలోని సత్సంగ్‌ ‌ ఆశ్రమానికి వెళ్లిన రామ్‌నాథ్‌ కోవింద్‌.. భారత్‌ యోగా విద్యా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆశ్రమంలో యోగా శిక్షకులు, విద్యార్థులతో రామ్‌నాథ్ మాట్లాడారు.‌ యోగాభ్యాసంలో అనుభవాలను ఆశ్రమ విద్యార్థులు వివరించారు. (చదవండి: హైకోర్టులో నిమ్మగడ్డకు భారీ ఎదురుదెబ్బ

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు