మహిళ అభ్యర్థన.. చలించిపోయిన సీఎం జగన్‌.. 4 రోజులు తిరక్కముందే

3 Aug, 2022 09:11 IST|Sakshi
గత నెల 29న గొల్లప్రోలులో సీఎం వైఎస్‌ జగన్‌కు తమ కష్టాన్ని చెప్పుకుంటున్న సునీత కుటుంబం

కాకినాడ సిటీ: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి అభ్యర్థించి 4 రోజులు తిరక్కముందే ఆర్థిక సహాయం మంజూరు కావడంతో ఆ పేద దంపతుల ఆనందానికి అవధుల్లేవు. కాకినాడ జిల్లా పత్తిపాడుకు చెందిన చీమల సునీత ఐదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. గుండెలో రంధ్రం ఉండటంతో జీవితాంతం మందులు వాడాల్సిన పరిస్థితి. సునీత భర్త కూలి పనులు చేస్తుంటారు. మందులు కూడా కొనుక్కోలేని పరిస్థితి.
చదవండి: మురిసిన మానవత్వం

గత నెల 29న కాపు నేస్తం కార్యక్రమానికి వచ్చిన సీఎంను ఈ పేద దంపతులు కలిసి తమ పరిస్థితిని వివరించారు. వారి పరిస్థితి అర్థం చేసుకున్న సీఎం వైఎస్‌ జగన్‌ చలించిపోయారు. వెంటనే వారిని ఆదుకునే బాధ్యతను కలెక్టరు కృతికా శుక్లాకు అప్పగించారు. మరుసటి రోజే కలెక్టర్‌ కృతికా శుక్లా ఆ దంపతులను తన వద్దకు పిలిపించుకున్నారు.

సాయం అందాక కలెక్టర్‌ కృతికా శుక్లాను కలసి కృతజ్ఞతలు తెలుపుతున్న సునీత కుటుంబం  

వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి నెలా రూ.10 వేలు ఆర్థిక సహాయం అందేలా ఏర్పాటు చేశారు. ఇప్పటికే రూ.10 వేలు వారి బ్యాంక్‌ ఖాతాలో జమ చేశారు. దీంతో భార్యాభర్తలిద్దరు తమ ఇద్దరు పిల్లలతో కలిసి మంగళవారం సాయంత్రం కలెక్టర్‌ కృతికా శుక్లాను కలిశారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తమ కృతజ్ఞతలు తెలియజేశారు.  

మరిన్ని వార్తలు