వైఎస్సార్‌సీపీ ఎంపీలతో సమావేశమైన సీఎం వైఎస్‌ జగన్‌

14 Sep, 2020 15:31 IST|Sakshi

సాక్షి, అమరావతి: పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలతో  వర్చువల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. సమావేశంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్ట్‌ల సాధనపై ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంట్‌లో చర్చకు తీసుకురావాలని సూచించారు. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలు, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులతో పాటు పోలవరం ప్రాజెక్ట్‌కు నిధుల సాధన అజెండాగా సమావేశం సాగింది.

అన్ని ఫార్మాట్ల అవకాశాలను పార్లమెంట్‌లో వినియోగించుకునేలా ఎంపీలకు సీఎం జగన్‌ దిశా నిర్దేశం చేశారు. ఇప్పటికే బీఏసీ సమావేశంలో ఏపీకి సంబంధించిన కరోనా  నియంత్రణ చర్యలు, రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ నిధుల వంటి అంశాలపై చర్చించాలని వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి స్పీకర్‌ను కోరిన సంగతి తెలిసిందే. (అందుకే అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ)

మరిన్ని వార్తలు