‘శత వసంతాల ఘంటసాల’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్‌

22 Dec, 2021 20:58 IST|Sakshi

సాక్షి, అమరావతి: మహాగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావుపై సాంస్కృతికశాఖ డైరెక్టర్‌ రేగుళ్ల మల్లికార్జునరావు రూపొందించిన ‘శతవసంతాల ఘంటసాల’ పుస్తకాన్ని   ఆంధ్రప్రదేశ్‌  సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఆయన క్యాంప్‌ కార్యాలయంలో ఆవిష్కరించారు.

ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి సందర్భంగా ఆయన జీవిత చరిత్ర, కుటుంబ సభ్యులు, వివిధ రంగాల్లో ప్రముఖులు రాసిన అభిప్రాయాలతో పాటు, ఘంటసాల చిత్రమాలికలతో కూడిన  పుస్తకాన్ని సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ రేగుళ్ల మల్లికార్జునరావు రూపొందించారు. ఈ  కార్యక్రమంలో  పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. 

చదవండి: సీఎం జగన్‌ కడప జిల్లా పర్యటన.. పూర్తి షెడ్యూల్‌ ఇదే

మరిన్ని వార్తలు