నంద్యాలలో ఉదయానంద ఆసుపత్రి ప్రారంభం

15 Aug, 2020 05:30 IST|Sakshi
ఉదయానంద ఆసుపత్రిని వీసీ ద్వారా ప్రారంభిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి

నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాలలో నూతనంగా నిర్మించిన ఉదయానంద మెగా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడుతూ ఈ ఆసుపత్రి ద్వారా నంద్యాల ప్రాంత ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. 

► నంద్యాలలో 250 పడకల మెగా మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ పేర్కొన్నారు. ఆసుపత్రిలో 80 ఐసీయూ, 120 ఆక్సిజన్‌ పడకలు ఉన్నాయని, కరోనా పాజిటివ్‌ కేసులకు ఇక్కడ చికిత్స అందించేందుకు నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ముందుకొచ్చారని కలెక్టర్‌ వీరపాండియన్‌ తెలిపారు.  
► రాయలసీమ ప్రాంత ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో ఉదయానంద ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లు ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి చెప్పారు. ఈ ఆసుపత్రితో పరిసర ప్రాంతాల ప్రజలకు ఎంతో ఉపయోగకరమని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి పేర్కొన్నారు. నంద్యాల పట్టణానికి మెడికల్‌ కాలేజీ కూడా మంజూరైందని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని చెప్పారు.  
► సీఎం క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ఆసుపత్రి డైరెక్టర్‌ స్వప్నారెడ్డి పాల్గొన్నారు.  
► నంద్యాలలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, గంగుల బిజేంద్రనాథరెడ్డి, తొగురు ఆర్థర్, వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, నంద్యాల సబ్‌ కలెక్టర్‌ కల్పనాకుమారి, ఎస్పీ ఫక్కీరప్ప, ఉదయానంద ఆసుపత్రి డైరెక్టర్లు రామకృష్ణారెడ్డి, పరమేశ్వరరెడ్డి, డాక్టర్లు శ్రీనాథరెడ్డి, రామేశ్వరరెడ్డి, భార్గవరెడ్డి, పోచా జనార్దన్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు కల్లూరి రామలింగారెడ్డి, మాజీ జెడ్పీటీసీ సూర్యనారాయణరెడ్డి, గంగుల భరత్‌రెడ్డి, జయన్న తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు