మీ ప్రభుత్వంలో ఆనందంగా ఉన్నాం.. సీఎం జగన్‌తో రైతులు

8 Jul, 2021 20:00 IST|Sakshi

ఉడేగోళంలో రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం జగన్

రైతులతో ముచ్చటించిన సీఎం..

సాక్షి, రాయదుర్గం: అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటిస్తున్నారు. ఉడేగోళం గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతు భరోసా కేంద్రంలో సీఎం జగన్‌ మొక్కను నాటారు. రైతు భరోసా కేంద్రంలో స్టాల్స్‌ను సందర్శించారు.

రైతులతో ముచ్చటించిన సీఎం జగన్‌..
రైతు భరోసా కేంద్రం ప్రారంభించిన అనంతరం సీఎం జగన్‌ కాసేపు రైతులతో ముచ్చటించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక తాము ఆనందంగా ఉన్నామని రైతులు అన్నారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. ఆర్బీకే కేంద్రాల ద్వారా రైతులకు ఎంతో మేలు అన్నారు. పాడి పరిశ్రమకు ప్రభుత్వం ఎంతో చేయూతనిస్తోందని రైతులు తెలిపారు.

రాయదుర్గం మార్కెట్‌ యార్డులో వైఎస్సార్‌ ఇంటిగ్రెటెడ్‌ అగ్రి ల్యాబ్‌ ప్రారంభించి, లబ్ధిదారులతో మాట్లాడనున్నారు. అనంతరం విద్యార్థి పాఠశాలలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అక్కడి బహిరంగ సభలో ప్రసంగిస్తారు.


2.10 గంటలకు వైఎస్సార్‌ జిల్లా పులివెందులలోని భాకరాపురం చేరుకుంటారు. 2.50 – 3.20 గంటలకు పులివెందులలోని ఇంటిగ్రెటెడ్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ గ్రౌండ్‌లో వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేస్తారు. శిలాఫలకాలు ఆవిష్కరిస్తారు. 3.55 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఎస్టేట్‌ చేరుకుంటారు. 4.10 – 4.55 గంటలకు వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. రాత్రికి అక్కడి గెస్ట్‌హౌస్‌లో బస చేస్తారు. 


(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు