నేడు ‘అమెరికన్‌ కార్నర్‌’ను ప్రారంభించనున్న సీఎం వైఎస్‌ జగన్‌

23 Sep, 2021 05:06 IST|Sakshi
వేదిక పరిసరాలను పరిశీలిస్తున్న వీసీ ప్రసాదరెడ్డి, కాన్సులేట్‌ అధికారులు

ఏయూ క్యాంపస్‌ (విశాఖ తూర్పు): ఆంధ్ర యూనివర్సిటీ (ఏయూ)లో ఏర్పాటు చేసిన అమెరికన్‌ కార్నర్‌ గురువారం నుంచి తన సేవలు ప్రారంభించనుంది. సీఎం వైఎస్‌ జగన్‌ వర్చువల్‌ విధానంలో ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ జోయల్‌ రీఫ్‌మెన్, యూఎస్‌ ఎయిడ్‌ ఇండియా డైరెక్టర్‌ వీణా రెడ్డి, ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి పాల్గొంటారు. ఈ ఏర్పాట్లను అమెరికన్‌ కాన్సులేట్‌ అధికారులతో కలిసి బుధవారం వీసీ పర్యవేక్షించారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు