వచ్చే ఏడాదిని విజిట్ ఆంధ్రప్రదేశ్-2023గా ప్రకటించిన సీఎం జగన్‌

27 Sep, 2022 20:01 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని విజిట్‌ ఆంధ్రప్రదేశ్‌ క్యాంపెయిన్‌లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాలను ప్రారంభించారు. జియో పోర్టల్‌ ఆధారంగా పర్యాటక సమాచార వ్యవస్థను సీఎం జగన్‌ ప్రారంభించారు. రాష్ట్రంలో సులువుగా పర్యాటక ప్రదేశాలను గుర్తించేందుకు వీలుగా రూపొందించిన జీఐఎస్‌ వెబ్‌పోర్టల్‌ను సీఎం జగన్‌ ఆవిష్కరించారు.  ఈ మేరకు వచ్చే ఏడాదిని విజిట్‌ ఆంధ్రప్రదేశ్‌-2023గా సీఎం జగన్‌ ప్రకటించారు. 

అనంతరం రాష్ట్రంలోని వైవిధ్య ఉత్సవాల బ్రోచర్లను సీఎం జగన్‌ ఆవిష్కరించారు. పర్యాటక అభివృద్దిలో కీలకపాత్ర పోషిస్తూ టూరిజం, ట్రావెల్, ఆతిధ్య రంగాలలో అత్యుత్తమ ప్రతిభ కనపరచాలని సీఎం జగన్‌ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అరకు నుంచి వచ్చిన గిరిజన థింసా నృత్య కళాకారులతో సీఎం జగన్‌ ముచ్చటించారు.  ఈ కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్‌ సీఎస్‌ డాక్టర్‌ రజత్‌ భార్గవ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు