‘అమెరికన్‌ కార్నర్‌’ కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌

23 Sep, 2021 11:25 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర యూనివర్సిటీ(ఏయూ)లో ఏర్పాటు చేసిన ‘అమెరికన్‌ కార్నర్‌’ కేంద్రాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ఏయూలో అమెరికన్‌ కార్నర్‌ ఏర్పాటు కావటం సంతోషకరమని అన్నారు. విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. అహ్మదాబాద్‌,హైదరాబాద్‌ తర్వాత విశాఖలో అమెరికన్‌ కార్నర్‌ ప్రారంభమైందని తెలిపారు.

దేశంలో మూడో కేంద్రంగా.. అమెరిన్‌ కాన్సులేట్‌ సహకారంతో విశాఖలో ‘అమెరికన్‌ కార్నర్‌’ ఏర్పాటు చేశారు. యూఎస్‌ విద్య, ఉద్యోగావకాశాల సమాచారానికి సంబంధించి సేవలు అందించనుంది. ఈ కార్యక్రమంలో అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ జోయల్‌ రీఫ్‌మెన్, యూఎస్‌ ఎయిడ్‌ ఇండియా డైరెక్టర్‌ వీణా రెడ్డి, ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి పాల్గొన్నారు.

చదవండి: ఆప్షన్‌–3 ఎంచుకున్న వారి ఇళ్ల పనులు అక్టోబర్‌ 25 నుంచి మొదలవ్వాలి

మరిన్ని వార్తలు