‘వైఎస్సార్‌‌-వేదాద్రి’ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం

28 Aug, 2020 11:22 IST|Sakshi

 రిమోట్ ద్వారా పైలాన్‌ను ఆవిష్కరించిన సీఎం

సాక్షి, జగ్గయ్యపేట: కృష్ణానదిపై జగ్గయ్యపేట మండలం వేదాద్రిలో నిర్మించనున్న ‘వైఎస్సార్‌- వేదాద్రి ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ఆయన శుక్రవారం తన క్యాంప్ ఆఫీస్‌లో రిమోట్ ద్వారా పైలాన్‌ను ఆవిష్కరించారు. (చదవండి: ప్రతి రంగంలోనూ విజన్‌)

ఈ సందర్భంగా  సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వం కృష్ణా జిల్లాలో సమస్యలను పట్టించుకోలేదన్నారు.14 నెలల కాలంలోనే వేదాద్రి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టామని, 2021 ఫిబ్రవరి కల్లా వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని సీఎం తెలిపారు. ఈ పథకం ద్వారా జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాలకు సాగునీరు అందుతుందన్నారు. రూ.491 కోట్ల వ్యయంతో 2.7 టీఎంసీల నీటి సామర్ధ్యంతో ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టామని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

వేదాద్రి గ్రామంలో ఎత్తిపోతల పథకానికి మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని పాల్గొన్నారు. వారికి స్థానిక ఎమ్మెల్యే, విప్ సామినేని ఉదయభాను స్వాగతం పలికారు. ఈ ఎత్తిపోతల పథకంతో జగ్గయ్యపేట నియోజకవర్గం సస్యశ్యామలం కానుంది. జగ్గయ్యపేట మండలంలో 8 గ్రామాలు, వత్సవాయి మండలంలో 10 గ్రామాలు, పెనుగంచిప్రోలు మండలంలో 10 గ్రామాల్లో 38,607 ఎకరాలకు సాగునీరు అందనుంది.


 

మరిన్ని వార్తలు