ఏపీ మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణకు ముహుర్తం ఖరారు

6 Apr, 2022 19:25 IST|Sakshi

విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో భేటీ ముగిసింది. దాదాపు 45 నిమిషాలపాటు సమావేశం కొనసాగింది.  ఈ సందర్భంగా మంత్రి వర్గ పునర్‌ వ్యవస్థీకరణ ఏర్పాటుపై గవర్నర్‌తో సీఎం జగన్‌ చర్చించారు. పాలనా వికేంద్రీకరణలో భాగంగా నూతన జిల్లాల ఏర్పాటును సీఎం జగన్‌ గవర్నర్‌కి వివరించారు. ఈ నెల 11న మంత్రి వర్గ పునర్‌ వ్యవస్థీకరణ చేపట్టనున్నట్లు గవర్నర్‌కి తెలిపారు. అదే రోజున నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని సీఎం వైఎస్‌ జగన్‌ గవర్నర్‌ను కోరారు. ఇందుకు సంబంధించి నూతన మంత్రుల జాబితా రెండు రోజుల్లో అందజేయనున్నట్లు వెల్లడించారు. అంతకుముందు రాజ్ భవన్ వద్ద సీఎం వైఎస్ జగన్‌కు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా, ఇతర ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు.

కాగా, గత వారం రోజులుగా సొంత రాష్ట్రం ఒరిస్సా, ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్‌ మంగళవారం రాత్రే ఢిల్లీ నుంచి విజయవాడ రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. గవర్నర్‌తో భేటీ అనంతరం మంత్రి వర్గ విస్తరణ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. ఇదిలా ఉండగా గురువారం సాయంత్రం 3 గంటలకి క్యాబినెట్‌ సమావేశం కానుంది.

చదవండి: (‘మాది సంక్షేమ ప్రభుత్వం.. గర్వంగా చెప్పగలం’)

>
మరిన్ని వార్తలు