పొరుగు రాష్ట్రాలతో సఖ్యతనే కోరుకుంటున్నాం

9 Jul, 2021 12:33 IST|Sakshi

పక్క రాష్ట్రాలతో మాకు విభేదాలు వద్దు

మా నీటిని మేం తీసుకుంటే తప్పేంటి? కృష్ణా జలాలపై రాజకీయాలు తగదు 

తెలంగాణలో ప్రాజెక్టులు కట్టినప్పుడు చంద్రబాబు గాడిదలు కాశారా? 

తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాజకీయాల్లో వేలు పెట్టమన్న జగన్‌ 

సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య ఒప్పందం మేరకే మా రాష్ట్రానికి కేటాయించిన నీటిని మేం తీసుకోవడంలో తప్పేముందని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో గురువారం రైతు దినోత్సవ సభలో ఆయన కృష్ణా జలాల అంశంపై మాట్లాడుతూ.. నీటి విషయంలో జరుగుతున్న గొడవలు చూస్తున్నామని, ఇటీవల కాలంలో తెలంగాణ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు.

చంద్రబాబు మొదట్లో మౌనంగా ఉన్నా.. తర్వాత మాట్లాడటం మొదలుపెట్టారన్నారు. ‘గతంలో ఏపీ అంటే కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణాల కలయిక. దశాబ్దాల తరబడి మూడు ప్రాంతాల మధ్య నీటి కేటాయింపులు జరుగుతున్నాయి. రాష్ట్రం విడిపోయాక తెలంగాణకు 298 టీఎంసీలు, ఏపీకి 144 టీఎంసీలు, కోస్తాకు  369 టీఎంసీలు కేటాయించగా.. కేంద్ర ప్రభుత్వంతో కలసి నీటి కేటాయింపులపై 2015, జూన్‌ 19న సంతకాలు చేశాం. పోతిరెడ్డిపాడు నుంచి కిందకు పూర్తిస్థాయిలో నీరు రావాలంటే శ్రీశైలంలో 881 అడుగులు నీళ్లు ఉండాలి.

ఈ రెండేళ్లు మినహాయిస్తే శ్రీశైలంలో పూర్తి నీటి మట్టం 885 అడుగుల నీళ్లు ఉన్న రోజులు గత 20 ఏళ్లలో ఏడాదిలో 20 నుంచి 25 రోజులు కూడా లేవు. ఇలాంటి సమయంలో పోతిరెడ్డిపాడుకు పూర్తిస్థాయిలో నీటిని తీసుకెళ్లలేని పరిస్థితి. మరోవైపు పాలమూరు రంగారెడ్డి, డిండి ప్రాజెక్టు, కల్వకుర్తి సామర్థ్యం పెంచి 800 అడుగులలోపే నీటిని తీసుకునే వెసులుబాటు తెలంగాణకు ఉంది.

796 అడుగుల వద్దే తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోంది. 800 అడుగుల్లోపు లోనే మీకు కేటాయించిన నీటిని వాడుకుంటే తప్పులేనప్పుడు.. 881 అడుగులు ఉంటే తప్ప నీళ్లు వాడుకోలేని పరిస్థితి మాకున్నప్పుడు.. మేం 800 అడుగుల వద్దే మాకు కేటాయించిన నీటిని తీసుకోవడంలో తప్పేముంది?. ఈ రోజు చంద్రబాబు నీళ్ల గురించి మాట్లాడుతున్నారు.. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్‌ పాలమూరు రంగారెడ్డి, డిండి లాంటి ప్రాజెక్టులు కడుతుంటే ఆ సమయంలో గాడిదలు కాశారా’అని జగన్‌ ప్రశ్నించారు.
 

పొరుగు రాష్ట్రాలతో సఖ్యతనే కోరుకుంటున్నాం
 369 టీఎంసీలు కేటాయించగా.. కేంద్రంతో కలసి నీటి కేటాయింపులపై 2015, జూన్‌ 19న సంతకాలు చేశాం. పోతిరెడ్డిపాడు నుంచి కిం దకు పూర్తిస్థాయిలో నీరు రావాలంటే శ్రీశైల ంలో 881 అడుగులు నీళ్లు ఉండాలి. ఈ రెం డేళ్లు మినహాయిస్తే శ్రీశైలంలో పూర్తి నీటి మట్టం 885 అడుగుల నీళ్లు ఉన్న రోజులు గత 20 ఏళ్లలో ఏడాదిలో 20–25 రోజులు కూడా లేవు. ఇలాంటి సమయంలో పోతిరెడ్డిపాడుకు పూర్తిస్థాయిలో నీటిని తీసుకెళ్లలేని పరిస్థితి. మరోవైపు పాలమూరు రంగారెడ్డి, డిండి ప్రాజెక్టు, కల్వకుర్తి సామర్థ్యం పెంచి 800అడుగుల లోపే నీటిని తీసు కునే వెసులుబాటు తెలంగాణకు ఉంది.

796 అడుగుల వద్దే తెలం గాణ విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోంది. 800 అడుగు ల్లోపు లోనే మీకు కేటాయించిన నీటిని వాడుకుంటే తప్పులేనప్పుడు.. 881 అడు గులు ఉంటే తప్ప నీళ్లు వాడుకోలేని పరిస్థితి మాకు న్నప్పుడు.. మేం 800 అడుగుల వద్దే మాకు కేటాయించిన నీటిని తీసుకోవడంలో తప్పేముంది?. ఈ రోజు చంద్రబాబు నీళ్ల గురించి మాట్లాడుతున్నారు.. ఆయన సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్‌ పాలమూరు రంగారెడ్డి, డిండి లాంటి ప్రాజెక్టులు కడుతుంటే గాడిదలు కాశారా’అని జగన్‌ ప్రశ్నించారు.
 
సఖ్యతతోనే పరిష్కారం: జగన్‌
తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాజకీయాల్లో వేలు పెట్టలేదు.రాబోయే రోజుల్లోనూ వేలు పెట్టను. రాష్ట్రాల మధ్య సఖ్యత ఉండాలి. సఖ్యతతోనే పరిష్కారాలు వెతుక్కోవాలి.  

మరిన్ని వార్తలు