గురుపూరబ్‌ ఉత్సవాలకు రండి

26 Nov, 2020 04:53 IST|Sakshi
క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన శ్రీ గురుసింగ్‌ సహ ధర్మ ప్రచార్‌ కమిటీ ప్రతినిధులు. చిత్రంలో దేవినేని అవినాష్‌

సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసి ఆహ్వానించిన 

గురుసింగ్‌ సహ ధర్మప్రచార్‌ ప్రతినిధులు 

సాక్షి, అమరావతి: గురుసింగ్‌ సహ ధర్మ ప్రచార్‌ కమిటీ ప్రతినిధులు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈనెల 30న గురునానక్‌ జయంతి సందర్భంగా నిర్వహించే గురుపూరబ్‌ ఉత్సవాలకు హాజరు కావాలని వారు సీఎంను ఆహ్వానించారు. ఈమేరకు ఆహ్వానపత్రికను అందజేశారు. విజయవాడ గురునానక్‌ కాలనీలోని గురుద్వార్‌లో జరిగే ఉత్సవాలకు రావాలని వారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కోరారు. 

► స్త్రీ సత్‌ సంఘ్‌ (మహిళా విభాగం) అధ్యక్షురాలు కులదీప్‌ కౌర్‌ మాతాజీ, సిక్కు కమ్యూనిటీ వెల్ఫేర్‌ సొసైటీ అధ్యక్షులు ఎస్‌ హర్మిందర్‌ సింగ్, శ్రీ గురుసింగ్‌ సభ అధ్యక్షులు ఎస్‌ కన్వల్‌జిత్‌ సింగ్, పింకి హర్విందర్‌ సింగ్‌ తదితరులు సీఎం వైఎస్‌ జగన్‌ను క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు.
► విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి దేవినేని అవినాష్‌ ముఖ్యమంత్రిని కలిశారు. 

సీఎంను కలిసిన ‘కియా’ ప్రతినిధులు
కియా మోటార్స్‌ ప్రతినిధులు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తమ సంస్థకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందిస్తున్నందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. కియా మోటార్స్, ఇండియా ఎండీ కూక్‌ హ్యూన్‌ షిమ్, కియా మోటార్స్‌ లీగల్‌ హెచ్‌వోడీ జుడే లి, ప్రిన్సిపల్‌ అడ్వైజర్‌ డాక్టర్‌ సోమశేఖర్‌ రెడ్డి తదితరులు సీఎంను కలిశారు.   
క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కియా మోటార్స్‌ ప్రతినిధులు   

మరిన్ని వార్తలు