ప్రధాని మోదీకి సీఎం జగన్‌ లేఖ

11 May, 2021 17:13 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి..ప్రధాని నరేంద్ర మోదీకి మంగళవారం లేఖ రాశారు. ఆక్సిజన్‌ కేటాయింపులు, సరఫరాపై లేఖలో ప్రస్తావించారు. ఏపీకి 910 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజెన్ సరఫరా చేయాలని ఈ సందర్భంగా కోరారు. ప్రస్తుతం 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేస్తున్న అది ఏమాత్రం సరిపోవడం లేదని తెలిపారు. 20 ఆక్సిజన్‌ ట్యాంకర్లను ఏపికి మంజూరు చేయాలని కోరారు. తమిళనాడు, కర్ణాటక నుంచి ఆక్సిజన్‌ దిగుమతి చేసుకుంటున్నామని అది సరిపోవడం లేదన్నారు. మోదీకి జగన్‌ రాసిన లేఖలోని అంశాలను పరిశీలిస్తే..

 ►ఈనెల 10న చెన్నై, కర్ణాటక నుంచి రావాల్సిన ఆక్సిజన్‌ ఆలస్యమైంది. ఆక్సిజన్‌ రావడం ఆలస్యమవ్వడంతో తిరుపతిలో 11 మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
►ప్రస్తుతం కర్ణాటక నుంచి దిగుమతి చేసుకుంటున్న...20 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను 150 మెట్రిక్‌ టన్నులకు పెంచాలని లేఖలో ప్రస్తావించారు.
►ప్రస్తుతం ఒడిశా నుంచి దిగుమతి చేసుకుంటున్న...210 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను 400 మెట్రిక్‌ టన్నులకు పెంచాలని కోరారు.
►భారత్‌ బయోటెక్‌ కోవాగ్జిన్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు... టెక్నాలజీ బదిలీ అంశాన్ని పరిశీలించాలని లేఖలో తెలిపారు.
►పెద్ద మొత్తంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేయాలంటే టెక్నాలజీ బదిలీ తప్పనిసరి. వ్యాక్సిన్‌ ఉత్పత్తికి సంబంధించి...ఐసీఎంఆర్‌, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీలు సహకరించాయి
►ఇతర వ్యాక్సిన్‌ ఉత్పత్తి కంపెనీలకు టెక్నాలజీని అందించే విషయంపై నిర్ణయం తీసుకోవాలని ప్రధాని మోదీని కోరిన సీఎం వైఎస్‌ జగన్‌
►దీంతో తక్కువ సమయంలోనే ఎక్కువ వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేయొచ్చన్న సీఎం

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు