విశాఖ నుంచి పరిపాలన దిశగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం!

11 Oct, 2023 22:32 IST|Sakshi

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయదశమి నుంచే విశాఖ నుంచి పరిపాలన కొనసాగించే దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఉత్తరాంధ్రలో సీఎం క్యాంపు కార్యాలయం,ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం కమిటీని నియమించింది.

విశాఖపట్నంలో సీఎం అదనపు క్యాంపు కార్యాలయం ఏర్పాటు పరిశీలన చెయ్యాలని కమిటీని ఆదేశించింది. మున్సిపల్, ఆర్థిక, జిఏడి ప్రిన్సిపాల్ సెక్రటరీలతో కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

సీఎం జగన్‌ ఉత్తరాంధ్ర ప్రాంతంలో పర్యటనలు, క్షేత్రస్థాయిలో పర్యటనల నిమిత్తం అవసరమైన కార్యాలయాలు ఏర్పాటుపై పరిశీలన చెయ్యాలని సూచిస్తూ ప్రభుత్వం ఉన్నతాధికారులకు సూచించింది. 

మరిన్ని వార్తలు