బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మృతి పట్ల సీఎం జగన్‌ సంతాపం

6 May, 2022 20:51 IST|Sakshi

సాక్షి, అమరావతి: మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. బొజ్జల కుటుంబసభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనారోగ్యం కారణంగా బొజ్జల.. హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శ్రీకాళహస్తి నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేశారు. ఆయన స్వగ్రామం  శ్రీకాళహస్తి సమీపంలోని ఊరందూరు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా బొజ్జల పనిచేశారు.
చదవండి: మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూత

మరిన్ని వార్తలు