ఏపీ: 17 పంచాయతీలకు జాతీయ అవార్డులు..

24 Apr, 2021 13:33 IST|Sakshi

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అవార్డులు ప్రదానం చేసిన ప్రధాని

పాల్గొన్న సీఎం వైఎస్‌ జగన్‌, మంత్రి పెద్దిరెడ్డి

సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో ‘స్థానిక పాలనా పరిస్థితుల’ ఆధారంగా ఏటా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవార్డులలో ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌ ఏకంగా 17 అవార్డులను దక్కించుకుంది. పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శనివారం ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. అవార్డుల పోటీలో దేశవ్యాప్తంగా 74 వేల గ్రామ పంచాయతీలు పోటీ పడ్డాయి.

దేశంలో ఎక్కువ అవార్డులు వచ్చిన నాలుగో రాష్ట్రం ఏపీ..
ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి 17 అవార్డులు వచ్చాయని.. దేశంలో ఎక్కువ అవార్డులు వచ్చిన నాలుగో రాష్ట్రం ఏపీ అని ఆయన పేర్కొన్నారు. ఈ-గవర్నెన్స్‌ కింద ఆంధ్రప్రదేశ్‌కు అవార్డు వచ్చిందన్నారు. గాంధీ స్ఫూర్తితో సీఎం జగన్ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారని.. గ్రామ సచివాలయ వ్యవస్థ పనితీరు అద్భుతంగా ఉందని ఆయన పేర్కొన్నారు. గుంటూరు, కృష్ణా జిల్లా పరిషత్‌లకు అవార్డులు వచ్చాయని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.

చదవండి:
మాటేసి ఉన్నాం.. మాస్క్‌ లేకుండా వచ్చారో జాగ్రత్త
సీఎం సహాయ నిధికి రూ.1.33 కోట్ల విరాళం

మరిన్ని వార్తలు