అమరవీరుల దినోత్సవం.. సీఎం జగన్‌ నివాళులు

23 Mar, 2022 15:39 IST|Sakshi

సాక్షి, అమరావతి: అమరవీరుల దినోత్సవం(మార్చి 23న) సందర్భంగా బుధవారం శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో భగత్‌సింగ్‌ చిత్రపటానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, మంత్రి వనిత, చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ కొరుముట్ల శ్రీనివాసులు, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు