జ్యోతిరావు పూలేకు సీఎం జగన్‌ నివాళి

11 Apr, 2021 12:25 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, వైఎస్సార్‌ సీపీ బీసీ సెల్ కన్వీనర్ జంగా కృష్ణమూర్తి, ఎంపీ మిథున్ రెడ్డి, సీఎం ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, ఎమ్మెల్యే జోగి రమేష్ పాల్గొన్నారు. 

ఆయన చూపిన బాటలో నడుస్తూ..
అణగారిన వర్గాల ఆశాజ్యోతి, స్త్రీ విద్యకు బాటలు వేసిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే అని సీఎం వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల సంక్షేమం కోసం పనిచేసిన నాయకుడని కొనియాడారు. ‘‘ఆయన చూపిన బాటలో నడుస్తూ.. అందరి సంక్షేమమే లక్ష్యంగా పాలన చేస్తున్నామని’’ సీఎం ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

విశాఖలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు..
విశాఖపట్నం: ప్రముఖ సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు విశాఖలో ఘనంగా జరిగాయి. నగరంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో బీసీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్‌తో పాటు విశాఖ నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే.. బీసీలకు, బడుగు వర్గాలకు చేసిన సేవలు మరువలేనివని మంత్రి అవంతి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. అంబేద్కర్‌, జ్యోతిరావు పూలే వంటి నేతల ఆశయాల సాధనలో రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. విశాఖ నగర మేయర్‌ గొలగాని హరి వెంకట కుమారి మాట్లాడుతూ, బీసీల అభ్యున్నతికి జ్యోతిరావు పూలే చేసిన కృషి భావితరాలకు ఆదర్శమన్నారు.


చదవండి:
‘హోదాపై సమాధానం చెప్పాల్సింది బీజేపీయే’
టీడీపీ నేత దాష్టీకం: తన్ని.. మెడపట్టి గెంటి..

మరిన్ని వార్తలు